Refrigerator Tips: ఈ కాలంలో ప్రతి ఒక్క ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది కామన్ అయిపోయింది. ఆహార పదార్థాలతో పాటు, మరికొన్ని జ్యూస్ లు, పండ్లు, పాల పదార్థాలు, గుడ్లు తదితర వంట సామాగ్రిని మనం ఫ్రిడ్జ్ లో పాడవకుండా పెడుతుంటాం. అయితే కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెడితే ప్రమాదకరం అని చాలామందికి తెలియదు. ఏయే వస్తువులను ఫ్రిడ్జ్ లో పెట్ట కూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది వంటలు చేసే క్రమంలో ఎక్కువగా ఉల్లి పాయలు కోస్తుంటారు. వంట చేసుకోగా మిగిలినవి తర్వాత వాడుకోవాలని తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు. అయితే ఈ తరిగిన ఉల్లిపాయల వాసన కారణంగా ఫ్రిడ్జ్ లో ఉన్న మిగతా వస్తువుల పాడైపోతాయి. కాబట్టి తరిగిన ఉల్లిపాయలను అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు.
Also Read: AP Politics: వారు మాజీలయ్యారు.. పత్యర్థులు అమాత్యులయ్యారు.. రివేంజ్ రాజకీయాలు స్టార్ట్
కోసి పుచ్చకాయలను ఏదైనా బాక్స్ లేదంటే గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. డైరెక్ట్ గా పెట్టొద్దు. కోయని పుచ్చకాయ అయితే డైరెక్ట్ గా పెట్టొచ్చు.
బంగాళా దుంపలు ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే చల్లదనానికి వాటిలో చెక్కర స్థాయి పెరుగుతుంది. దాంతో కూర టేస్ట్ ఉండదు.
పూలను అల్లుకోవడానికి చాలామంది ఫ్రిడ్జ్‌లో పెడతారు. అయితే ఈ పూలను ఆహార పదార్థాలు లేదంటే తినే కూరగాయలు, ఇతర వస్తువులు ఉన్న ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. ఆ పూల వాసనలకు ఇతర పదార్థాల మీద ప్రభావం పడి రుచి మారుతుంది.
అరటి పండ్లను ఫ్రిడ్జ్ లో పెడితే వాటిలోని ఎంజైమ్స్ తగ్గిపోతాయి. దాంతో అవి త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది.

ఎక్కువ కాలం నిల్వ ఉండే తేనెను కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. అలా చేస్తే దాని టేస్ట్ మారే అవకాశం ఉంటుంది.
చాలామంది బ్రెడ్ ప్యాకెట్లను ఓపెన్ చేసిన తర్వాత అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తారు. దాని వల్ల బ్రెడ్స్ గట్టిగా మారి తినలేకుండా అయిపోతాయి. కాబట్టి కవర్ మూసి ఉంచాలి.
ఇక తెలుగు వారు సీజన్లకు తగ్గట్టు పచ్చళ్లను పెట్టుకుంటారు. అవి పాడైపోకుండా చాలామంది ఫ్రిడ్జ్‌లో పెడతారు. అయితే చల్ల దనానికి పచ్చళ్లు త్వరగా పాడైపోతుంటాయి. కాబట్టి వీటిని భద్రమైన ప్లేస్ లో పెట్టుకోవాలి.
Also Read:Tirumala: తిరుమలకు ఇక సామాన్య భక్తులు వెళ్లడం కష్టమే?