https://oktelugu.com/

Shruti Haasan: శృతి హాసన్ ను ఫోన్‌ నంబర్‌ అడిగితే.. సూపర్ రిప్లై ఇచ్చింది

Shruti Haasan: హీరోయిన్‌ శృతి హాసన్ అంటేనే బోల్డ్ హీరోయిన్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. పైగా తన ఫాలోవర్స్‌ తో పలు విషయాలను పంచుకోవడానికి నెలకి ఒకసారి అయినా ఇన్‌స్టాగ్రామ్‌ లో లైవ్‌ లోకి వస్తూ ఉంటుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా…ఖాళీ దొరికితే ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేస్తూనే ఉంటుంది శ్రుతిహాసన్. తన గురించి గూగుల్‌లో ఎక్కువగా ఆరా తీసిన ప్రశ్నలకు శ్రుతి ఆన్సర్ ఇచ్చింది. ఓ నెటిజన్ ఆమె ఫోన్‌ నంబర్‌ అడగ్గా.. 100 […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 13, 2022 / 11:04 AM IST
    Follow us on

    Shruti Haasan: హీరోయిన్‌ శృతి హాసన్ అంటేనే బోల్డ్ హీరోయిన్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. పైగా తన ఫాలోవర్స్‌ తో పలు విషయాలను పంచుకోవడానికి నెలకి ఒకసారి అయినా ఇన్‌స్టాగ్రామ్‌ లో లైవ్‌ లోకి వస్తూ ఉంటుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా…ఖాళీ దొరికితే ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేస్తూనే ఉంటుంది శ్రుతిహాసన్. తన గురించి గూగుల్‌లో ఎక్కువగా ఆరా తీసిన ప్రశ్నలకు శ్రుతి ఆన్సర్ ఇచ్చింది.

    Shruti Haasan

    ఓ నెటిజన్ ఆమె ఫోన్‌ నంబర్‌ అడగ్గా.. 100 అని బదులిచ్చింది. రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి అడగ్గా.. డేటింగ్‍లో ఉన్నానని తెలిపింది. మీ ఆస్తి మొత్తం ఎంతుంటుంది? అన్న ప్రశ్నకు…అది తెలుసుకునే పనిలో ఉన్నానని…అదింకా పెరగాలనుకుంటున్నానని చెప్పింది. మొత్తానికి మీ ఆస్తి ఎంత ? అని అడిగితే.. శ్రుతి హాసన్ సూపర్ రిప్లై ఇచ్చింది అన్నమాట.

    Also Read:  అసెంబ్లీ సమావేశాలకు బద్దకమేనా ప్రజాప్రతినిధులూ?

    ఆ మధ్య ఓ నెటిజన్‌ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అంటూ శృతి హాసన్ కు ప్రపోజల్ పెట్టాడు. దానికి శ్రుతీహాసన్ సింపుల్ గా ‘చేసుకొను’ అంటూ అతన్ని తిరస్కరిస్తూ సెటైర్లు కూడా వేసింది. ‘ఇక వైజాగ్‌ కు ఎఫ్పుడు వస్తున్నారు’ అని మరొకరు అడిగితే.. ‘మీకు తెలియదు, నాకు చిన్నప్పటి నుంచి వైజాగ్‌ తో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం వైజాగ్ కి వస్తూనే ఉంటాను’ అంటూ శృతి హాసన్ సెలవిచ్చింది.

    Shruti Haasan

    ఇక సినిమాల విషయానికి వస్తే.. షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పైగా శ్రుతి హాసన్ ఈ సినిమా కోసం తనదైన శైలిలో కసరత్తులు మొదలు పెట్టింది. శృతి హాసన్ ఈ సినిమా కోసం లావు పెరగడానికి తన డైట్ ను కూడా మార్చుకుంది.

    Also Read:  ప్చ్.. కలెక్షన్‌ కింగ్‌ సినిమా కలెక్షన్లు వందల్లోనే !

    Tags