https://oktelugu.com/

NTR: ఎన్టీఆర్ – అలియా రొమాన్స్ అదిరిపోతుంది !

NTR:  ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఐదేళ్ల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఈ సినిమా చేయబోతున్నాడు. పైగా ఆర్ఆర్ఆర్ వల్ల ఎన్టీఆర్ వేరే ప్రాజెక్ట్ మొదలుపెట్టలేదు. అయితే.. జక్కన్న సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఇప్పుడు కొరటాలతో మూవీ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. కాగా హీరోయిన్ ఎవరనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ సరసన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 13, 2022 / 10:56 AM IST
    JR NTR

    JR NTR

    Follow us on

    NTR:  ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఐదేళ్ల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఈ సినిమా చేయబోతున్నాడు. పైగా ఆర్ఆర్ఆర్ వల్ల ఎన్టీఆర్ వేరే ప్రాజెక్ట్ మొదలుపెట్టలేదు. అయితే.. జక్కన్న సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఇప్పుడు కొరటాలతో మూవీ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. కాగా హీరోయిన్ ఎవరనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    NTR

    NTR

    అయితే ఈ సినిమాలో హీరోయిన్ పై ఆ మధ్య ఒక ఇంట్రస్టింగ్ గాసిప్ వినిపించింది. తారక్ కి హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోబోతున్నట్లు టాక్ నడిచింది. నిజానికి ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్ కియారా అద్వానీనే అని, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేసినప్పుడు కూడా హీరోయిన్ గా తారక్, కియారా వైపే మొగ్గు చూపాడని వార్తలు వచ్చాయి. అయితే కియరా అద్వానీ, తారక్ సినిమాలో ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందనే సమయంలో ఇప్పుడు అలియా పేరు వినిపిస్తోంది.

    Also Read: కేజీఎఫ్ 2కు పోటీగా వస్తున్న మరో సినిమా..!

    కానీ, కియారాని తెలుగులో తీసుకువచ్చింది కొరటాలనే. ‘భరత్ అనే నేను’ అనే సినిమాతో కియరాకి మంచి బ్రేక్ ఇచ్చాడు కొరటాల. అందువల్ల కొరటాల డేట్స్ అడిగితే.. ఇప్పుడు కియారా ఓకే అనడం ఖాయం. పైగా ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. కియారాకి ఈ సినిమా పట్ల ఆసక్తి ఉండే అవకాశం ఉంది. అందుకే.. కియారానే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం ఉంది.

    ఇక ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక కొరటాల ఈ చిత్రం కోసం బలమైన నేపథ్యాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది.

    Also Read:  సంతాన సమస్యా.. ఐతే ఇది మీ కోసమే !

    Tags