Tips to look Younger: ఒకప్పుడు మూడు పూటలా ఆహారం తిని.. శారీరక శ్రమ ఎక్కువగా ఉండడంతో 90 ఏళ్ల వరకు బతికేవారు. అంతేకాకుండా ఈ వయసు వరకు యాక్టివ్గా ఉండేవారు. అయితే ప్రస్తుతం వాతావరణం కాలుష్యం కావడంతో చాలామంది చిన్న వయసులోనే వృద్ధులుగా కనిపిస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు ఆహార నాణ్యత లోపం కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని ఆరోగ్య నియమాలు పాటించడం వల్ల నిత్యం యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఇందులోనూ చాలామంది యంగ్ గా కనిపించాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం ఈ ఐదు టిప్స్ ఫాలో అయితే కచ్చితంగా రిజల్ట్ వస్తుంది..
ఫాస్టింగ్:
ఒకప్పటి కంటే ఇప్పుడు అందుబాటులో రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. దీంతో చాలామంది ఇష్టం వచ్చినట్లు వీటిని తింటూ ఉన్నారు. ఇలా క్రమ పద్ధతి లేకుండా ఆహారం తినడం వల్ల శరీరంలో అనవసరపు కొవ్వు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి కొవ్వును కరిగించుకోవాలంటే వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉండాలని అంటున్నారు. అంటే వారంలో ఒకరోజు ఒక పూట మాత్రమే భోజనం చేసి మరో పూట ఫ్రూట్స్ లేదా లైట్ ఫుడ్ తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా వారానికి రెండుసార్లు చేసినా శరీరంలో అదనపు కొవ్వు పెరగకుండా చేసుకోవచ్చు.
వ్యాయామం:
కేవలం ఫాస్టింగ్ మాత్రమే కాకుండా.. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శరీరం యాక్టివ్ గా ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉండి శరీరం ముడతలు పడకుండా ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల కండరాల కదలిక ఉండి కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. అందువల్ల ఫాస్టింగ్ తో పాటు ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల యవ్వనంగా కనిపించే అవకాశం ఉంటుంది.
ఫ్రెష్ ఫుడ్:
కొంతమంది మిగిలిపోయిన ఆహారం తింటూ ఉంటారు. ఇలా కాకుండా ఎప్పటికప్పుడు వేడి చేసిన ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల అదనపు బ్యాక్టీరియా శరీరంలోకి చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యలు లేకుండా ఉంటాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయితే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఫలితంగా మృత కణాలు రాకుండా ఉంటాయి.
నిద్ర:
మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. ప్రతిరోజు కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే ఈ నిద్ర కలత లేనిదిగా ఉండాలి. అలా ఉండాలంటే నిద్రపోయే ముందు ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి. ఫోన్ చూస్తూ నిద్రపోవడం.. ఆల్కహాల్ తీసుకున్న వెంటనే నిద్రపోవడం వంటివి చేస్తే కలత నిద్ర ఉండే అవకాశం ఉంది. ఇలాంటివి అలవాటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎనిమిది గంటల పాటు నిద్రపోతే శరీరం యవ్వనంగా ఉంటుంది.
కమ్యూనికేషన్:
ప్రస్తుత కాలంలో కమ్యూనికేషన్ తక్కువగా అయిపోయింది. ఒకరికి ఒకరు కలవకుండా కేవలం ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు. అలాకాకుండా బంధువులు, పిల్లలు, జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండాలి. వీరితో కలిసి విహారయాత్రలకు వెళ్లాలి. ఇలా వారంలో ఒకసారి సంతోషంగా గడిపితే ఒత్తిడి నుంచి దూరం అవుతారు. ఇలా ఒత్తిడి నుంచి దూరమైతే నిత్యం యవ్వనంగా ఉండే అవకాశం ఉంటుంది.