Phil Salt: పొట్టి ఫార్మాట్లో భారీగా పరుగులు చేయాలని బ్యాటర్లు భావిస్తుంటారు. తమదైన రోజు అదరగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు భారీగా పరుగులు చేయడానికి.. బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడడానికి తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇంతవరకు ఏ ఆటగాడు కూడా సెంచరీకి మించి పొట్టి ఫార్మాట్లో పరుగులు చేయలేదు. అయితే తొలిసారి ఈ ఘనతను ఇంగ్లాండ్ ఆటగాడు సాల్ట్ అందుకున్నాడు. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన రెండవ టి20లో అతడు దుమ్ము రేపే ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 141 పరుగులు చేసి సునామీని సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్ లో 15 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి అంటే బ్యాటింగ్ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.. సాల్ట్ సాధారణంగానే దూకుడుగా ఆడుతుంటాడు.. పిచ్ నుంచి సహకారం లభించడంతో పండగ చేసుకున్నాడు. బంతి బ్యాట్ మీదికి రావడంతో వీరవిహారం చేశాడు.. 141 పరుగులు చేసిన సాల్ట్ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.
పొట్టి ఫార్మాట్ చరిత్రలో 42 ఇన్నింగ్స్ లు ఆడిన అతడు ఏకంగా నాలుగు శతకాలు సాధించాడు. ఇక అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా ప్లేయర్ మాక్స్ వెల్ కొనసాగుతున్నాడు. 114 ఇన్నింగ్స్ లలో అతడు ఐదు శతకాలు సాధించాడు. ఆ తర్వాత స్థానంలో టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ ఉన్నాడు. ఇతడు 151 ఇన్నింగ్స్ లలో ఐదు సెంచరీలు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 80 ఇన్నింగ్స్ లలో నాలుగు సెంచరీలు చేశాడు. సాల్ట్ 42 ఇన్నింగ్స్ లోనే నాలుగు సెంచరీలు చేయడం విశేషం.
ఇక వ్యక్తిగతంగా సాల్ట్ మరో రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ జట్టు తరుపున పొట్టి ఫార్మాట్లో మూడు సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికా మీద 141.. వెస్టిండీస్ మీద 2023లో 119 పరుగులు చేశాడు. 2023 లోనే వెస్టిండీస్ మీద సెయింట్ జార్జ్ వేదికగా జరిగిన మ్యాచ్లో 109* పరుగులు చేశాడు. హేల్స్ 2014లో చటోగ్రామ్ వేదికగా శ్రీలంక మీద 116 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ప్లేయర్లు 48 బౌండరీలు సాధించారు. ఇందులో ఫోర్లు 30, సిక్సర్లు 18 ఉన్నాయి. అంతకంటే ముందు 2024లో నైరోబి వేదికగా గాంబియా జట్టుపై జింబాబ్వే 57 బౌండరీలు సాధించింది. ఇక పూర్తి సభ్యుల జట్టు విభాగంలో ఇంగ్లాండ్ చేసిన 304 పరుగులు హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం. ఆ తర్వాత స్థానంలో 297 పరుగులతో ఇండియా ఉంది. 2024లో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఈ ఘనత సాధించింది.. 2024లో జోహన్నెస్ బర్గ్ వేదికగా సౌత్ ఆఫ్రికా పై భారత్ ఒక వికెట్ కోల్పోయి 283 రన్స్ చేసింది. డెహ్రాడూన్ వేదికగా 2019లో ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ మూడు వికెట్ల కోల్పోయి 278 పరుగులు చేసింది.
ENGLAND 304/2 IN A T20I MATCH
– This will go down in the History books in shorter format, Take a bow, Phil Salt. pic.twitter.com/ZeitKGPYE8
— Johns. (@CricCrazyJohns) September 12, 2025