Zodiac Signs Dussehra: శని దేవుడు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఒకసారి శనిపీడ పట్టిందంటే ఏడేళ్ల వరకు విడవదని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ శని అనుగ్రహం ఉంటే ఏ పని అయినా విజయవంతంగా పూర్తి అవుతుందని చాలామందికి తెలియదు. అయితే ఒక్కోసారి శని దేవుడికి ఎటువంటి పూజలు చేయకపోయినా కొన్ని రాశులపై అనుగ్రహం చూపిస్తాడు. ముఖ్యంగా ఈ ఏడాది దీపావళి సందర్భంగా కొన్ని రాశులపై శని దేవుడు కనకవర్షం కురిపించనున్నాడు. మరి ఆ రాశుల వారికి లక్కు ఎప్పటినుంచి ఉందంటే?
శని గ్రహానికి గురు అయిన శని దేవుడు అక్టోబర్ మూడవ తేదీన పూర్వభద్ర నక్షత్రం లోకి ప్రవేశించనున్నాడు. బృహస్పతి నక్షత్రం అయినా ఇందులోకి శని దేవుడు వెళ్లడం వల్ల కొన్ని రాశులపై ప్రభావం చూపనుంది. ఈ రాశుల వారు దీపావళికి ముందే ధనవంతులుగా అయ్యే అవకాశం ఉందని వేద శాస్త్రం తెలుపుతుంది. మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
శని దేవుడి అనుగ్రహం వల్ల అక్టోబర్ మూడవ తేదీ అంటే దసరా తెల్లారి నుంచి నుంచి కర్కాటక రాశి వారికి అదృష్టం వరించనుంది. వీరు ఇప్పటినుంచి ఏ పని ప్రారంభించిన విజయవంతంగా పూర్తి చేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వివాహం చేసుకోవాలని అనుకునే వారికి సంప్రదింపులు జరుగుతాయి. విద్యార్థులు ఏ పోటీ పరీక్షల్లో పాల్గొన్న విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు కనక వర్షం కురిసే అవకాశం ఉంది. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ఎదురు చూస్తే.. వారికి ఇప్పటినుంచి వరం ఉండనుంది. అక్టోబర్ 3 నుంచి వీరు అదృష్ట జాతకంలోకి ప్రవేశిస్తారు.
కుంభ రాశి జాతకులు దసరా తెల్లవారి నుంచి ధనవంతులు కాబోతున్నారు. గతంలో ఉన్న సమస్యల నుంచి వీరు బయటపడతారు. ఇప్పటినుంచి వీరు మనశ్శాంతిగా కొనసాగుతారు. కొత్తగా ప్రాజెక్టును ప్రారంభిస్తే వెంటనే దానిని పూర్తి చేస్తారు. అనుకున్న ప్రతి పని పూర్తవుతుంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. గతంలో పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకోవడంతో లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
శని దేవుడి అనుగ్రహం అక్టోబర్ మూడు నుంచి మీన రాశిపై కూడా ఉండనుంది. వీరికి సమాజంలో గుర్తింపు లభించనుంది. రాజకీయ నాయకులు అయితే ప్రజల మద్దతు ఉంటుంది. ఇంట్లో సానుకూల వాతావరణము ఉండడంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. పిల్లల కెరీర్ పై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనాల్సి వస్తే విజయం సాధించడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి కలిసి మెలిసి ఉంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యమైన జీవితం ఉంటుంది.
Disclaimer : ఇది కేవలం పండితుల నుంచి వచ్చిన సోషల్ మీడియా సమాచారం మాత్రమే. దీనికి oktelugu.com నిర్ధారించదు