Flipkart: ప్రముఖ ఈకామర్స్ కంపెనీలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు తీపికబురు అందించింది. సెల్ బ్యాక్ ప్రోగ్రామ్ ద్వారా ఈ సంస్థ పాత ఫోన్లను అమ్మే అవకాశం కల్పిస్తోంది. వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ ద్వారా సులభంగా పాత ఫోన్లను అమ్మేయవచ్చు. 1700 పిన్ కోడ్లలో కొత్త సెల్ బ్యాక్ ప్రోగ్రామ్ ను ఫ్లిప్ కార్ట్ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 14వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ను అయినా కస్టమర్లు సెల్ బ్యాక్ లో భాగంగా విక్రయించే అవకాశం అయితే ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ లోనే కాకుండా ఆఫ్ లైన్ లో కొనుగోలు చేసిన ఫోన్లను సైతం అమ్మే అవకాశాన్ని ఫ్లిప్ కార్ట్ కల్పిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ మాత్రమే ఫ్లిప్ కార్ట్ లో అమ్మే అవకాశం ఉన్నా భవిష్యత్తులో ఇతర ఫోన్లను కూడా ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించవచ్చు.
Also Read: చిరంజీవి, మహేష్, ప్రభాస్.. ఆఖరుకు బామ్మర్ధి విష్ణు వచ్చినా కరగవా జగన్?
ఫ్లిప్ కార్ట్ లో ఫోన్ ను విక్రయించాలని భావించే వాళ్లు మొదట ఫ్లిప్ కార్ట్ యాప్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్లిప్ కార్ట్ యాప్ లో బాటమ్ బార్ లో ఉండే మెనూపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెల్ బ్యాక్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా ఫోన్ ను సులభంగా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆ తర్వాత మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇచ్చి స్మార్ట్ ఫోన్ ను విక్రయించవచ్చు.
Also Read: అలీ, పోసానీలకు జగన్ న్యాయం చేస్తున్నాడా? అన్యాయమా?
మూడు ప్రశ్నలకు సమాధానాలను చెప్పి కన్ఫామ్ చేసిన తర్వాత ఫ్లిప్ కార్ట్ ఎగ్జిక్యూటివ్ వచ్చి ఫోన్ ను తీసుకుంటాడు. ఆ తర్వాత ఫోన్ యొక్క విలువ ఆధారంగా ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు వోచర్ ను అందజేయడం జరుగుతుంది. ధరను ముందుగానే అంచనా వేసుకుని ఫోన్ ను విక్రయించడం ద్వారా ఫోన్ విషయంలో ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు.
Also Read:
1. ‘భీమ్లా నాయక్’ ప్రమోషనల్ సాంగ్ రాబోతుంది
2. ట్రోలర్స్ కి మళ్ళీ దొరికిపోయిన మంచువారబ్బాయి… సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్స్