IPL 2022 Mega Auction: ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్. డబ్బుకు డబ్బు.. ప్రతిభకు ప్రతిభ వెలుగులోకి వచ్చే ప్రపంచంలోనే సంపన్న లీగ్. వినోదాన్ని పతాక స్థాయికి ప్రేక్షకులకు అందించే లీగ్ కూడా ఇదే. అయితే ప్రతి సంవత్సరం వేలంలో ఆటగాళ్లపై కోట్లు కుమ్మరిస్తూ కొనుగలు చేస్తున్నారు. మనం అత్యంత ఖరీదైన ఆటగాడిగా అంచనా వేసిన వారు తక్కువ మొత్తానికే అమ్ముడుపోతున్నారు. ఎవరూ ఊహించని ఆటగాడు కోట్లకు పడగలెత్తి ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తున్నాడు. అది ఐపీఎల్ స్వభావం. ఇది ప్రతి సంవత్సరం పెరుగూతూనే ఉంది. ఆటగాళ్లపై కనకవర్షం కురుస్తూనే ఉంది.ఇటీవల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక డబ్బులకు ఆటగాళ్లు అమ్ముడుపోయారు. సీజన్ వారీగా అత్యంత ఖరీదైన ఆటగాళ్లపై ఓ లుక్ వేద్దాం..
ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా (సీజన్ ల వారీగా):
1. 2008 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: ఎంఎస్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్)
ధర: 9.5 కోట్లు
2. 2009 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాళ్ళు: కెవిన్ పీటర్సన్ (RCB), ఆండ్రూ ఫ్లింటాఫ్ (CSK)
ధర: 9.8 కోట్లు
3. 2010 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాళ్ళు: షేన్ బాండ్ (KKR), కీరన్ పొలార్డ్ (MI)
ధర: 4.8 కోట్లు
4. 2011 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: గౌతమ్ గంభీర్ (KKR)
ధర: 14.9 కోట్లు
5. 2012 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: రవీంద్ర జడేజా (CSK)
ధర: 12.8 కోట్లు
6. 2013 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: గ్లెన్ మాక్స్‌వెల్ (MI)
ధర: 6.3 కోట్లు
7. 2014 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: యువరాజ్ సింగ్ (RCB)
ధర: 14 కోట్లు
8. 2015 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: యువరాజ్ (DD)
ధర: 16 కోట్లు
9. 2016 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: షేన్ వాట్సన్ (RCB)
ధర: 9.5 కోట్లు
10. 2017 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: బెన్ స్టోక్స్ (RPS)
ధర: 14.5 కోట్లు
11. 2018 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: బెన్ స్టోక్స్ (RR)
ధర: 12.5 కోట్లు
12. 2019 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాళ్ళు: జయదేవ్ ఉనద్కత్ (RR), వరుణ్ చక్రవర్తి (KXIP)
ధర: 8.4 కోట్లు
13. 2020 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: పాట్ కమిన్స్ (KKR)
ధర: 15.5 కోట్లు
14. 2021 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: క్రిస్ మోరిస్ (RR)
ధర: 16.25 కోట్లు
15. 2022 సంవత్సరం:
అత్యంత ఖరీదైన ఆటగాడు: ఇషాన్ కిషన్ (MI)
ధర: 15.25 కోట్లు
Also Read: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?