Life Lessons from Struggles: జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే సాధ్యం కానీ విషయం. కష్టాలు, నష్టాలు కూడా కలుగుతూ ఉంటాయి. అయితే సంతోషంగా ఉన్నప్పుడు అందరూ హాయిగా ఉంటారు. కాస్త కష్టం రాగానే విలవిలలాడిపోతూ ఉంటారు. కష్టంలోనూ సంతోషాన్ని వెతుక్కున్న వారికి ఏ సమస్య అయినా పెద్దదిగా కనిపించదు. అయితే చాలామంది చిన్న లోపం లేదా సమస్య కనిపించగానే తమ జీవితం ఇక ముగిసింది అని అనుకుంటారు. కానీ ఒక విజయం ముందు ఒక అపజయం ఉంటుంది అన్న విషయం కొందరు మేధావులు చెబుతూ ఉంటారు. అలాగే చిన్న అపజయం ఏర్పడగానే కుంగిపోకుండా.. విజయం కోసం పరితపిస్తూ ఉండాలి. అందుకు ఈ చిన్న కథ ఉదాహరణ. ఆ కథలోకి వెళ్తే..
Also Read: కన్నతల్లి కన్నీటి పాఠం – మరచిన మానవత్వం
దశరథ మహారాజు గురించి రామాయణం చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. శ్రీరామచంద్రమూర్తి తండ్రి అయిన ఈయనకు.. ఒక ఋషి శాపం పెడతాడు. అదేంటంటే ‘నీకు పుత్రశోకం కలుగుగాక..’అని అంటాడు. అంటే నీకు జన్మించే కుమారుడు వల్ల ఎంతో బాధ పడతావు అని చెప్పి వెళ్తాడు. ఆ ఋషి అలా శాపం ఇవ్వగానే దశరథ మహారాజు ఎంతో సంతోషంగా ఉంటాడు. దీంతో చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతారు. కృషి శాపం పెడితే బాధపడాలి గాని.. ఇలా ఎందుకు సంతోషంగా ఉన్నారు? అని అడుగుతారు. దీంతో దశరథ మహారాజు ఇలా చెబుతాడు..పుత్రశోకం కలగాలంటే పుత్రుడు జన్మించాలి కదా.. అని అంటాడు. అంటే పుత్రుడు కావాలని కోరుకుంటున్న తనకు పరోక్షంగా పుత్రుడు జన్మించే అవకాశం కలిగిందని సంతోషంగా ఉంటాడు.
అంటే ఈ స్టోరీలో దశరథ మహారాజు దుఃఖాన్ని చూడకుండా కేవలం సంతోషాన్ని మాత్రమే గ్రహించాడు. అలాగే మనుషుల్లో కూడా కష్టం వచ్చినప్పుడు అందులో ఉండే విజయం ఏంటి అనేది వెతుక్కోవాలి. కష్టం ఎవరికైనా కలుగుతుంది.. కానీ కొందరు మాత్రమే దాని నుంచి బయటపడుతున్నారు. అందుకు వారు చేసే గట్టి ప్రయత్నమే అని గుర్తించాలి. అంటే ఒక కష్టం వెనుక ఏదో సంతోషం దాగుంది అన్న విషయాన్ని గ్రహించాలి. అలా గ్రహించకుండా కష్టాన్ని తలుచుకుంటూ బాధపడితే ఎలాంటి ఫలితం ఉండదు.
జీవితం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. వీటి నుంచి బయటపడడానికి కొందరు తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. మరికొందరికి పెద్దగా సమస్య అనిపించదు. అయితే ఇలాంటి సమయంలో చేసే పనులు నిబద్ధతతో చేయడం వల్ల న్యాయం అనుకోకుండా జరిగే అవకాశం ఉంటుంది. అంటే కష్టంలో కూడా కొందరు తప్పుడు పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే కష్టం నుంచి బయటపడడానికి ఏదో రకంగా మరో తప్పు చేస్తారు. అలా చేయడం వల్ల నిత్యం కష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా న్యాయమైన పనులు చేయడం వల్ల ఒకసారి కష్టం జరిగినా మరోసారి జరగకుండా ఉంటుంది.
ఇక నేటి కాలంలో యూత్ చిన్న విషయానికే పెద్దగా ఐరానా పడిపోతున్నారు. అయితే తమ స్థాయికి మించి కష్టాలు వచ్చినప్పుడు ఇతరులను ఆశ్రయించాలి. తల్లిదండ్రులతో తమకున్న సమస్యను చర్చించుకోవాలి. లేదా స్నేహితులు తెలిసిన వారితో తమకున్న కష్టాన్ని చెప్పడం వల్ల పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.