Homeఅంతర్జాతీయంChina maglev rail: గంటకు 1000 కి.మీలు.. విమానం కంటే స్పీడు.. ఆ రైలును సృష్టించిన...

China maglev rail: గంటకు 1000 కి.మీలు.. విమానం కంటే స్పీడు.. ఆ రైలును సృష్టించిన చైనా.. ప్రపంచమే అవాక్కు

China maglev rail: చైనా టెక్నాలజీలో వేగంగా దూసుకుపోతోంది. పెరుగుతున్న సాంకేతికతను అన్నిరంగాలకు విస్తరిస్తూ.. అమెరికాకు సవాల్‌ విసురుతోంది. ఆర్థికంగా అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నస్తోంది. ఇక చైనా తయారీరంగం ఒక ప్రయోగశాల. ఇక్కడ అన్నీ తయారు చేస్తారు. తాజా హైస్పీడ్‌ రైలును రూపొందించిన చైనా విజయవంతంగా పరీక్షించింది.

చైనా అల్ట్రా హై స్పీడ్‌ మాగ్లెవ్‌ రైలును ఇటీవల పరీక్షించింది. గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రపంచ రవాణా సాంకేతికతలో సరికొత్త ఒరవడిని సృష్టించింది. ఈ వేగం సాధారణ విమానాలతో సమానమైనది, ఇది భూమిపై రవాణా వ్యవస్థలకు కొత్త అర్థాన్ని ఇస్తోంది. ఈ రైలు వాక్యూమ్‌ ట్యూబ్‌లో పరీక్షించబడింది, ఇది గాలి నిరోధకతను తగ్గించి అత్యధిక వేగాన్ని సాధ్యం చేస్తుంది. మాగ్నెటిక్‌ లెవిటేషన్‌ (మాగ్లెవ్‌) సాంకేతికత ఈ రైలు విజయానికి కీలకం. ఈ సాంకేతికత రైలును ట్రాక్‌పై తేలియాడేలా చేస్తుంది, దీనివల్ల ఘర్షణ దాదాపు శూన్యంగా మారి, అసాధారణ వేగం సాధ్యమవుతుంది. ఈ పరీక్షలు షాన్సీ ప్రావిన్స్‌లోని వాక్యూమ్‌ ట్యూబ్‌లో జరిగాయి, ఇది హైపర్‌లూప్‌ భావనను పోలి ఉంటుంది. గాలి నిరోధకతను పూర్తిగా తొలగిస్తుంది.

Also Read: ఇండియా ను దోచెయ్యడానికి సిద్దమవుతున్న ఎలాన్ మస్క్!

2023లోనే తయారీ..
ఈ అల్ట్రా హై స్పీడ్‌ మాగ్లెవ్‌ రైలు 2023లోనే తయారు చేసింది. అయితే వాక్యూమ్‌ లేని పరిస్థితుల్లో గంటకు 623 కి.మీ వేగాన్ని సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు వాక్యూమ్‌ ట్యూబ్‌లో వెయ్యి కి.మీ/గం వేగం సాధించడం ద్వారా, చైనా రవాణా సాంకేతికతలో మరో మైలురాయిని చేరుకుంది. ఈ సాంకేతికత భవిష్యత్తులో నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.


రవాణారంగంలో ఆధిపత్యం..
చైనా ఇప్పటికే షాంఘైలో గంటకు 431 కి.మీ వేగంతో నడిచే మాగ్లెవ్‌ రైలును విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇది ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలు. ఈ కొత్త అల్ట్రా హై స్పీడ్‌ మాగ్లెవ్‌ రైలు దాని గత విజయాలను మరింత బలపరిచి, రవాణా సాంకేతికతలో చైనా యొక్క ఆధిపత్యాన్ని హైలైట్‌ చేస్తుంది. ఈ సాంకేతికత ఇంకా ప్రయోగాత్మక దశలో ఉంది. వాణిజ్య ప్రయోగంలోకి రావడానికి అనేక సాంకేతిక, ఆర్థిక సవాళ్లను అధిగమించాలి. వాక్యూమ్‌ ట్యూబ్‌ల నిర్మాణం, భద్రతా ప్రమాణాలు, ఆర్థిక సాధ్యత వంటి అంశాలు కీలకం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version