spot_img
Homeఎంటర్టైన్మెంట్Tilak Varma Meets Ram Charan On Peddi Sets: 'పెద్ది' సెట్స్ లో రామ్...

Tilak Varma Meets Ram Charan On Peddi Sets: ‘పెద్ది’ సెట్స్ లో రామ్ చరణ్ తో భేటీ అయిన ఇండియన్ సెన్సేషనల్ క్రికెటర్ తిలక్ వర్మ..కారణం ఏంటంటే!

Tilak Varma Meets Ram Charan On Peddi Sets: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 27 న ఆయన పుట్టినరోజు కి సినిమా మొత్తం పూర్తి అవుతుందని అంటున్నారు మేకర్స్. ఆ తర్వాత ఒక్క ఐటెం సాంగ్ చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంటుందట. వచ్చే నెల 30 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి మేకర్స్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇండియన్ లేటెస్ట్ సెన్సేషనల్ క్రికెటర్ తిలక్ వర్మ నేడు పెద్ది మూవీ షూటింగ్ సెట్స్ కి విచ్చేయడం , ఆ మూవీ టీం తో కాసేపు సమయాన్ని గడిపి, వాళ్ళతో అనేక ముచ్చట్లు జరిపి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?

తిలక్ వర్మ గతం లో మెగాస్టార్ చిరంజీవి ని ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ మూవీ షూటింగ్ సెట్స్ లో ఉన్నాడు. ఇతని తీరు చూస్తుంటే మెగా ఫ్యామిలీ హీరోలకు చాలా పెద్ద ఫ్యాన్ లాగా అనిపిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ‘పెద్ది ‘ మూవీ సెట్స్ కి వచ్చిన తిలక్ వర్మ కి , రామ్ చరణ్ తాను సినిమాలో వాడిన బ్యాట్ ని సిగ్నేచర్ చేసి బహుమతిగా ఇచ్చి పంపించాడు. తిలక్ వర్మ తీరు చూస్తుంటే, ఆయన చాలా డౌన్ టు ఎర్త్ మనిషి లాగా అనిపిస్తోంది అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు. క్రికెట్ లో అన్ని విజయాలు సాధించిన తర్వాత తన అభిమాన హీరోల వద్ద ఎంతో ఒదిగి, ఒక సాధారణ అభిమాని లాగా మాట్లాడడం వాళ్లకు తెగ నచ్చేసింది. మొదటి నుండి తిలక్ వర్మ ఇదే తరహా యాటిట్యూడ్ తో నడుచుకుంటూ వస్తున్నాడు.

ఇక ‘పెద్ది’ విషయానికి వస్తే, ఈ సినిమా పై మొదటి నుండి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా నుండి విడుదలయ్యే ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ పేలడం తో అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. ‘చికిరి చికిరి ‘ పాటతో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన మేకర్స్ , రీసెంట్ గా విడుదలైన ‘రయ్ రయ్ రారా’ పాటతో మరో చార్ట్ బస్టర్ ని ఆడియన్స్ కి అందించారు.. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి వచ్చే ప్రతీ కంటెంట్ అంచనాలు పదింతలు చేసే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇకపోతే ఈ నెల 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక చిన్న టీజర్ ని వదిలే అవకాశం ఉందని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version