Exercise Motivation:రకరకాల ఒత్తిడులు.. అనవసరమైన బాధలు.. ఉద్యోగం, వ్యాపారం కారణంగా టెన్షన్ వాతావరణంలో గడిపే వారు కచ్చితంగా ఆరోగ్య ప్రయోజనాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు వైద్యులు చెబుతున్నారు. అయితే చాలామందికి సమయం లేకపోవడంతో వ్యాయామంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో చిన్న వయసులోనే కొత్త రోగాలను తెచ్చుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో ఉన్న కలుషిత వాతావరణం తో పాటు కల్తీ మయమైన ఆహారం కారణంగా అనేక రోగాలు వస్తున్నాయి. అంతేకాకుండా వీటిలో ఉండే అధిక కొవ్వు కారణంగా బరువు పెరుగుతున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గే అవసరం చాలా ఉంది. అంతేకాకుండా బరువుతో నీరసంగా ఉండి ఏ పని పూర్తి చేయలేకపోతుంటారు.అయితే ఉత్సాహంగా ఉంటూ బద్దకాన్ని విడగొట్టేందుకు ఇప్పుడు మొబైల్ లో కొత్త యాప్ అలరిస్తోంది. ఆ యాప్ ఏంటంటే?
Also Read: యవ్వనంలోకి రాగానే ఈ 5 విషయాలను నేర్చుకోవాలి.. ఎందుకంటే?
ప్రస్తుత కాలంలో ఏ పని అయినా మొబైల్ తోనే చేయగలుగుతున్నారు. ప్రపంచంలో ఉండే అనేక విషయాలు మొబైల్ ద్వారా తెలిసిపోతున్నాయి. బరువు తగ్గే విషయంలోనూ చాలామంది మొబైల్ లో ఉన్న టిప్స్ ఫాలో అవుతున్నారు. అయితే ఇవి వాడే తప్పుడు నిపుణులను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పే యాప్ ఎలాంటి వ్యాయామం గురించి కాకుండా కేవలం బద్ధకాన్ని మాత్రం విడగొడుతుంది.
గూగుల్లోని ప్లే స్టోర్ లోకి వెళ్లి Steppin అని టైప్ చేయాలి. ఈ యాప్ లో వాకింగ్ కు సంబంధించిన కొన్ని టాస్కులు ఉంటాయి. ఈ టాస్కులు పూర్తి చేసేందుకు సెట్ చేసుకోవాలి. అయితే ఇవి పూర్తి చేస్తేనే గూగుల్ లేదా వాట్సాప్ ఇతర యాప్స్ ఓపెన్ అవుతాయి. అంటే ఉదాహరణకు ఒకరోజు వెయ్యి అడుగులు వేసిన తర్వాతనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అలా సెట్ చేసుకోవడం ద్వారా కచ్చితంగా వాకింగ్ చేస్తారు. దీంతో ప్రతిరోజు వాకింగ్ చేసి యాక్టివ్ అవుతారు. ఇలా కొన్ని రోజులపాటు కాస్తా కష్టంగా ఉన్న ఆ తర్వాత అలవాటుగా మారిపోతుంది. దీంతో మీ లైఫ్ లో బద్ధకం అనేది ఉండదు.
Also Read: ఈ మూడు విషయాలకు దూరంగా ఉంటే మిమ్మల్ని ఆపేవారు ఉండరు..
చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఈ యాప్ ను ఫాలో కావడం వల్ల ఆరోగ్యం ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు అంటున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయడం ద్వారా కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో వ్యాయామం చేయడానికి కూడా చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అయితే ఇలాంటి సీరియస్ నెస్ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటే వ్యాయామం చేయగలుగుతారు.
చాలామంది వ్యాయామం చేయాలని అనుకుంటారు. కానీ ఉదయం లేవగానే ఏదో పనులు లేదా ఇతర కారణాలవల్ల చేయలేక పోతారు. ఈ యాప్ టాస్క్ తో కాస్త టైం తీసుకుని వాకింగ్ చేస్తారు. నేటి కాలంలో మిగతా పనులతో పాటు వ్యాయామం కూడా తప్పనిసరిగా మారిపోయింది. వ్యాయామం తప్పనిసరిగా చేస్తేనే ఆరోగ్యంగా ఉండి మిగతా పనులు చేయగలుగుతారు. అందువల్ల ఈ యాప్ తో బద్ధకాన్ని వీడే ప్రయత్నం చేయండి.