Youth Life Lessons:యవ్వనంలోకి రాగానే రెక్కలు విచ్చుకున్న పక్షిలాగా ప్రతి ఒక్కరు సమాజంలోకి వెళ్తారు. ఈ సమయంలో జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పటివరకు అమ్మానాన్నల వద్ద జీవితం గడిపిన వారు వారు చెప్పిన ప్రకారంగా ఉంటారు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత సమాజంలోకి వెళ్తే మనకు నచ్చిన విధంగా ఉండాలంటే కుదరదు. కొన్ని విషయాల్లో మనకు మనమే నిబంధనలు ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలే. అంతేకాకుండా సమాజంలో గుర్తింపుతో పాటు అవకాశాలు రావాలంటే కొన్ని విషయాలను తప్పకుండా పాటించాలి. వాటిలో ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం..
షేక్ హ్యాండ్:
అబ్బాయిలు సమాజంలోకి వెళ్లిన తర్వాత షేక్ అండ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూర్చొని ఇవ్వద్దు. ఎందుకంటే కూర్చొని షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా మీలోని నిర్లక్ష్యం లేదా చేతకానితనం తెలిసిపోతుంది. ఎదుటివారికి శాఖాన్ని ఇచ్చేటప్పుడు నిలబడి ఇవ్వడం ద్వారా ఒక పటిష్టమైన కలయిక ఏర్పడినట్లు అవుతుంది. దీంతో ఎదుటివారి కూడా ఇంప్రెస్ అయ్యి కమ్యూనికేషన్ కొనసాగించడానికి ఇష్టపడుతుంటారు. దీనివల్ల ముందు ముందు ఎన్నో రకాలుగా లాభాలు ఉండే అవకాశం ఉంటుంది.
Also Read: బాడీలో ఏ ఫుడ్ ఎంత సేపట్లో అరుగుతుందో తెలుసా?
మాట్లాడడం:
ఎక్కువ సార్లు మాట్లాడడం వల్ల సమాజంలో గుర్తింపు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనవసరం లేని విషయాల్లో మాట్లాడడం వల్ల ఒక్కోసారి ఇది కరెక్ట్ కాకపోవచ్చు. దీంతో అప్పటివరకు ఉన్న మంచి పేరు కాస్త తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొందరికి మీ మాటలు నచ్చకపోతే వారు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అవసరం అయినంతవరకు మాత్రమే మాట్లాడడం నేర్చుకోవాలి. అనవసరం విషయాల్లో తల దూర్చకుండా ఉండాలి.
ఆహారం:
యవ్వనంలోకి రాగానే కొత్త కొత్త రుచులు చూడాలని చాలామంది అనుకుంటారు. దీంతో ఎడాపెడా లాగించేస్తారు. అయితే ఇలా ఇష్టం వచ్చినట్లు తినడం వల్ల అనారోగ్యం అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫుడ్ లిమిట్ ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు వాటి వల్ల సమస్య ఏర్పడితే దానికి దూరంగా ఉండటమే మంచిది. అంతేకాకుండా పరిమితికి మించి ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది.
Also Read: ఈ మూడు విషయాలకు దూరంగా ఉంటే మిమ్మల్ని ఆపేవారు ఉండరు..
స్నేహం.. మోసం..
ఈ టైంలో స్నేహితులు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. అయితే వీరిలో మంచి స్నేహితులు ఉండొచ్చు.. చెడ్డవారు ఉండొచ్చు.. స్నేహితుల్లో ఎవరైనా మీకు నచ్చని యెడల వారికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఒక్కోసారి మారుతారని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే కొందరి మనస్తత్వాలు ఎప్పటికీ ఒకేలాగా ఉండిపోతాయి. అంతేకాకుండా మీరు కూడా ఇతరులను మోసం చేయకుండా ఉండాలి. అలా ఉంటేనే జీవితంలో బంధాలు కలిసి ఉంటాయి.
సమయం:
చదువు పూర్తి అయినవారికి సమయం చాలా దొరుకుతుంది. కానీ ఇదే సమయంలో కొంతమంది జల్సాగా తిరుగుతూ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ ఏమాత్రం సమయం వృధా చేయకుండా జీవిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలా చేయకపోతే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కేవలం ఉద్యోగం కోసం లేదా రిలేషన్షిప్ కోసం ఇతరుల వద్ద చేయి చాచి ఉండాల్సిన అవసరం ఏర్పాటు చేసుకోవద్దు.