Job Scandal Hindupuram: మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. ఎవరు అధికారంలో ఉన్న అధికార పక్ష నేతల ఆగడాలకు చెక్ పడడం లేదు. ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని( Outsourcing employee ) అకారణంగా విధులనుంచి తొలగించారు. తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటే లైంగిక వాంఛ తీర్చాల్సిందేనని తేల్చి చెప్పారు. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వెలుగు చూసింది ఈ ఘటన. ఇక్కడ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత మూడుసార్లు ఆయనే గెలిచారు. అయితే సినీ నటుడు కావడంతో నిత్యం బిజీగా ఉంటారు బాలకృష్ణ. నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో బాలకృష్ణ పిఏలతో పాటు టిడిపి నేతలు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ లైంగిక వేధింపు ఆరోపణలు ఆ కోవలోకి చెందినవే.
Also Read: ఏపీలో కొత్త జిల్లాలు?
విధుల నుంచి తొలగింపు.. హిందూపురంలో( Hindu Puram ) ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టు మారింది. టిడిపికి చెందిన ఓ వ్యక్తి ఆ కాంట్రాక్ట్ ను పొందాడు. అప్పటివరకు అక్కడ అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలిగా ఓ మహిళ పనిచేస్తున్నారు. ఆమెను విధుల్లో నుంచి తొలగించారు. అయితే ఒంటరిగా నివసిస్తోంది ఆ మహిళ. వృద్ధురాలు అయిన తల్లి, కుమారుడితో నివాసం ఉంటోంది. ఆమెకు ఆ ఉద్యోగం చాలా అవసరం. ఈ నేపథ్యంలో స్థానికంగా ఓ నేత సాయంతో కాంట్రాక్టు దక్కించుకున్న టిడిపి నేతను ఆశ్రయించింది. తనను విధుల్లోకి తీసుకోవాలని వేడుకొంది. అయితే సదరు కాంట్రాక్టు పొందిన టిడిపి నేత లైంగిక వాంఛ తీర్చాలని డిమాండ్ చేశాడు. అదే విషయాన్ని స్థానిక నేత ద్వారా ఫోన్లో చెప్పించాడు. అయితే ఆ నేత ఆ మహిళతో మాట్లాడిన ఆడియో సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. తాను అలాంటి దానిని కాదని.. లేకుంటే ఆ ఉద్యోగమే వద్దని సదరు బాధిత మహిళ బదులిచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంభాషణపై నెటిజన్లు భిన్న కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: ఆడవాళ్లకు నెలకు రూ.1500 ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాలట?
ఎమ్మెల్యే కు చెడ్డ పేరు..
హిందూపురం నియోజకవర్గంలో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి అన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) అందుబాటులో లేకపోవడంతో టిడిపి నేతలు కొందరు రెచ్చిపోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నందమూరి బాలకృష్ణను గెలిపించారు హిందూపురం ప్రజలు. ఆయన అందుబాటులో లేకపోయినా అభివృద్ధి చేస్తున్నారన్న సంతృప్తి వారిలో ఉంది. కానీ కొందరు టిడిపి నేతలు పుణ్యమా అని హిందూపురంలో పార్టీపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీనిపై నందమూరి బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఉద్యోగం కావాలంటే పక్కలోకి రావాలి
ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో టీడీపీ నేతల కీచకపర్వం
సోషల్ మీడియా లో వైరల్ గా ఆడియో సంభాషణలు
ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ముస్లిం మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు
ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించిన శానిటేషన్… pic.twitter.com/7wlE198W4U
— Telugu Feed (@Telugufeedsite) July 22, 2025