Celebrity couple: ఈ ఫోటో లో హాట్ గా తన భర్త ని ముద్దాడుతున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?, ఈమె తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె బాలీవుడ్ లోకి వెళ్ళింది. అక్కడ కెరీర్ ఆరంభం లోనే వరుస సూపర్ హిట్స్ రావడం తో ఆమెకు అక్కడే అవకాశాలు భారీగా వచ్చాయి. దీంతో బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ హీరోయిన్స్ క్యాటగిరీ లో లేడీ సూపర్ స్టార్ అనే స్థాయికి ఎదిగింది. హీరోయిన్ గా అలాంటి క్రేజ్ ని సంపాదించుకున్న ఈమెకు హాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ సంచలన విజయం సాధించడం తో ఈమెకు హాలీవుడ్ లో అవకాశాలు రావడం మొదలైంది. మొదటి హాలీవుడ్ చిత్రం లోనే లేడీ విలన్ గా నటించే అవకాశాన్ని సంపాదించి మంచి పేరు కొట్టేసింది.
Also Read: SSMB 29కి బ్రేక్… మహేష్, రాజమౌళి ఏం చేస్తున్నారో తెలుసా?
ఆ సినిమా అక్కడ పెద్ద హిట్ అవ్వడం తో ఆమెకు హాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి. అలా లేడీ విలన్ గా, అప్పుడప్పుడు హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతూ హాలీవుడ్ లోనే స్థిరపడిపోయింది. ఆమె మరెవరో కాదు, ప్రియాంక చోప్రా(Priyanka Chopra). ఈమె తన భర్త నిక్ జోనాస్ తో కలిసి లేటెస్ట్ గా సముద్రం నడివడ్డున ముద్దాడుతూ దిగిన ఒక ఫోటో ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ప్రియాంక చోప్రా ఏ చిన్న పోస్ట్ పెట్టినా సోషల్ మీడియా లో వేరే లెవెల్ రీచ్ ఉంటుంది. ఇక ఇలాంటి హాట్ ఫోటోలు అప్లోడ్ చేస్తే హద్దే ఉండదు. నిమిషాల వ్యవధిలోనే మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇది గ్లోబల్ వైడ్ గా ఆమెకు ఉన్న క్రేజ్.
Also Read: రామ్ చరణ్ కోసం ఊరినే కొనేశారుగా..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!
వరుసగా హాలీవుడ్ సినిమాలు చేస్తే అక్కడే స్థిరపడిన ప్రియాంక చోప్రా ఇప్పుడు మహేష్ బాబు(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) సినిమాతో మన ఇండియన్ సినిమాలో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ చిత్రం లో ఆమె మెయిన్ విలన్ క్యారక్టర్ చేస్తుంది. ముందుగా అందరూ హీరోయిన్ అనుకున్నారు కానీ, ఆమె చేస్తుంది విలన్ క్యారక్టర్ అని తర్వాత తెలిసింది. విలన్ క్యారెక్టర్స్ ని అద్భుతంగా పండించడం లో మంచి అనుభవం ఉన్న ప్రియాంక చోప్రా, ఈ సినిమాలో ఏ రేంజ్ లో నటించవుతుందో చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కాబట్టి, ఇది భారీ హిట్ అయితే ఆమె రేంజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రెండు కీలకమైన షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం,మూడవ షెడ్యూల్ ని అతి త్వరలోనే ప్రారంభించనున్నారు.