Self-Improvement: జీవితాల్లో సుఖంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరు మంచి పనులు చేస్తూ ఉంటే.. మరికొందరు తప్పుడు పనులు చేస్తూ పక్కదారి పడతారు. అయితే మంచి పనులు చేసేవారు కొన్నాళ్లపాటు కష్టపడతారు. వీరిని చూసి తప్పుడు పనులు చేసి తాత్కాలికంగా సుఖపడాలని అనుకుంటారు. అయితే శాశ్వతంగా సుఖంగా ఉండాలంటే మాత్రం కొన్ని అలవాట్లను అలవర్చుకోవాలి. అవి ఉండడం వల్ల ఎప్పటికైనా జీవితం ఆనందమయంగా మారుతుంది. అయితే వీటిని పాటించడానికి కొందరు ఒప్పుకోరు. కాస్త కష్టమైన వీటిని పాటిస్తే ఖచ్చితంగా జీవితం బాగుండే అవకాశం ఉంటుందని కొందరు పండితులు చెబుతున్నారు. వాటిలో ప్రధానమైన మూడింటిని చూద్దాం..
వాయిదాలు..
ఒక పనిని ప్రారంభించినప్పుడు దానిని సమయానుకూలంగా పూర్తి చేయాలి. అలా కాకుండా వాయిదాలు వేస్తే ఆ పని ఎన్నటికీ పూర్తికాదు. ఈ పని కోసమే మిగతా పనులకు ఆటంకం కలిగి జీవితం లో సంతోషం లేకుండా పోతుంది. అంతేకాకుండా వాయిదాలు వేయడం వల్ల కొన్ని రోజులపాటు మనశాంతి లేకుండా ఉంటారు. అందువల్ల ఒకసారి మొదలుపెట్టిన పనిని గడువులోగా పూర్తిచేసే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఈరోజు చేయాలి అని అనుకునే పనిని ఈ రోజే పూర్తి చేయాలి. రేపటికి వాయిదా వేయడం వల్ల ఈరోజు పనితో పాటు రేపటి పని ఉండడం వల్ల అధిక భారం ఏర్పడుతుంది.
వస్తువులు..
కొన్ని వస్తువులను మనం మారుస్తూ ఉంటాం. ఇలా మార్చడం వల్ల ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని అనుకుంటాం. కానీ వీటితో కూడా సమయం వృధా కావడంతోపాటు అనవసరమైన తలనొప్పులు ఏర్పడతాయి. ఉదాహరణకు వాస్తు ప్రకారం గా ఇంట్లోని కొన్ని వస్తువులను పెద్దలు ఏర్పాటు చేస్తారు. కానీ నేటి కాలంలో కొందరు వాటిని మార్చి తమకు అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. అంతేకాకుండా చేసే ప్రతి పనికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. ఎక్కడి వస్తువులు అక్కడే ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండకుండా జీవితంలో సుఖంగా ఉండగలుగుతారు.
Also Read: మీరు జీవితంలో ఎదగాలంటే ఈ ఒక్కటి పక్కకు పెట్టండి..
విషయాలు..
చాలామందికి ఉండే బ్యాండ్ హ్యాబిట్ ఏంటంటే ఒక దగ్గరే విషయాలు మరొక దగ్గరికి చేర్చడం. ఇలా చేర్చడం ద్వారా వీరితో పాటు మరొకరితో అనవసరమైన కొత్త విషయాలు తెలుసుకొని తలనొప్పి తెచ్చుకోవడమే అవుతుంది. ఇలా కొత్త విషయాల గురించి ఆలోచిస్తూ అసలు పనిని దూరం పెట్టేస్తారు. దీంతో జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఎక్కడి విషయాలను అక్కడే ఉంచడం మంచిది. దీంతో ఎలాంటి తలనొప్పి లేకుండా ఉండగలుగుతారు.
ఇవి మాత్రమే కాకుండా అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చడం.. దారిన పోయే సునకంపై దాడి చేయడం వంటివి చేయొద్దు. ఎందుకంటే జీవితంలో సంతోషం కావాలని కోరుకునే వారు తమ పని తాము సక్రమంగా చేస్తే చాలు. ఎదుటివారికి సాయం అడిగినప్పుడు చేస్తే చాలు. లేని వివాదాలు సృష్టించుకుని చిక్కుల్లో పడవద్దు.