
Eating chapatis at night: ప్రస్తుతం మనుషులను రోగాలు భయపెడుతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు వెంటాడుతున్నాయి. మనం తినే ఆహారమే మనకు శత్రువులా మారుతోంది. రసాయన ఎరువుల వాడకంతో ఆహారం కలుషితంగా మారుతోంది. ఫలితంగా ఇరవైలోనే జుట్టు ఊడిపోవడం, కళ్లుకనిపించకపోవడం వంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఇంత చిన్న వయసులో ఇలాంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మన ఆహార అలవాట్లే కావడం గమనార్హం. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ రోజుల్లో అధిక బరువు భయంతో చాలా మంది అన్నానికి బదులు ఇతర ఆహారాలు తీసుకుంటున్నారు. ఇందులో చపాతీలు ప్రధానంగా తింటున్నారు.

చపాతీలు ఎలా తినాలి?
మనం తీసుకునే ఆహారం పరిమితంగా ఉండాలి. అపరిమితంగా ఉంటే మొదటికే మోసం వస్తుంది. కొందరు డాక్టర్ చెప్పారు కదాని ప్లేట్ నిండా చపాతీలు పెట్టుకుని లాగించేస్తారు. ఇది ఇంకా ప్రమాదకరం. గోధుమ పిండిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటంతో చపాతీలు ఎక్కువ తింటే ఒంట్లో షుగర్ స్థాయితో పాటు అన్ని పెరుగుతాయి. ఫలితంగా మనం ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా చపాతీలు కాకుండా పుల్కాలు తినడం మంచిది. అవి కూడా అధికంగా కాదు రెండు లేక మూడు తీసుకోవడం ఉత్తమం.
గోధుమల్లో ఏముంటుంది?
గోధుమల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రాత్రి పూట ఎక్కువగా తింటే కేలరీలు తక్కువ ఖర్చయి శరీరంలో కొవ్వుగా మారుతుంది. దీంతో గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతుంది. గోధుమల్లో విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నిషియం, కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీంతో వీటిని సాయంత్రం పూట పరిమితంగా తీసుకోవడం వల్ల ప్రయోజనమే. కానీ అపరిమితంగా తీసుకుంటే నష్టమే. ఈ విషయం గమనించుకుని ఆరోగ్యాభిలాషులు మసలుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మూడు తీసుకుంటే..
మన ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో మనం రాత్రి పూట అధిక మొత్తంలో ఆహారం తీసుకుంటే జీర్ణం కాదు. ఫలితంగా సమస్యలు వస్తాయి. చపాతీలు కాకుండా నూనె పెట్టకుండా చేసే పుల్కాలు తీసుకుంటే మరీ మంచిది. తేలికైన పుల్కాలు రెండు లేదా మూడు తీసుకుని రాత్రి భోజనం ముగిస్తే మంచిది. అధిక మొత్తంలో ఆహారం తీసుకుంటే జీర్ణాశయం తెల్లవార్లు రిపేర్లు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో లివర్ పై భారం పడుతుంది. అందుకే మనకు తేలికగా ఉండాలంటే పుల్కాలు తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.