
Signs Goddess Lakshmi: ప్రస్తుత రోజుల్లో ప్రతి వారికి ధనమే కావాలి. బతకడానికి డబ్బు కావాలి. కానీ ఆ డబ్బు కోసం నానా గడ్డి తినాల్సిన అవసరం లేదు. మన కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు మనకు డబ్బు అవసరమే. కానీ ఆ డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు. ఎవరినో ముంచి సంపాదిస్తే అది ఉంటుందా? అక్రమంగా సంపాదించినదేదీ నిలవదు. జనం మాత్రం ఇప్పుడు ఇలాగే తయారయ్యారు. ఎదుటి వాడిని ముంచైనా డబ్బు సంపాదించుకోవాలనే దురాశతో ఉన్నారు. మనకు లక్ష్మీయోగం పట్టాలే కానీ డబ్బుదేముంది. మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తే కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తున్నట్లే అని భావించుకోవచ్చు.

లక్ష్మీదేవికి స్వరూపమే..
సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే ఆడపిల్ల అంటారు. కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఆడపిల్లలను కంటున్నారు. కడుపులోనే స్కానింగ్ చేసి ఆడపిల్ల అంటే తొలగిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం. మన నాగరికత ఎటు వెళ్తోంది? దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోంది. భవిష్యత్ లో కన్యాశుల్కం ఆచారం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆడపిల్ల పుడితే అరిష్టం అనుకుంటారు కానీ అదృష్టం. నేటి దుస్థితికి అందరం బాధ్యులమే. ఆడపిల్లలను పురిట్లోనే చంపుకోవద్దు. వారి జనాభా పెరిగేందుకు ప్రోత్సహించండి.
లక్ష్మీదేవి వస్తున్నట్లు..
లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తున్నట్లు కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయి. మనం నిద్ర లేవగానే ఇల్లు ఊడుస్తున్నట్లు కనిపిస్తే మనకు అదృష్టమే వస్తుంది. గుడ్లగూబ కనిపించినా మనకు లక్ష్మీ యోగం పట్టబోతోందని తెలుసుకోవాలి. లేస్తూనే శంకర శబ్ధం వినిపిస్తే కూడా లక్ష్మీదేవి వస్తున్నట్లు అనుకోవాలి. ఇంకా చెరకు గడ కనిపిస్తే ఇంకా మంచిది. చెరకు మన గడపలోకి వస్తే త్వరలో మన జాతకం మారబోతోందని అర్థం. ఇలా చాలా విషయాలు మనకు లక్ష్మీయోగం పడుతున్నట్లు అనుకోవాలి. లక్ష్మీదేవి అంటే ధనమే కాదు. మంచి గుణం, మంచి పేరు ఇవి కూడా లక్ష్మీయోగాలే. కానీ ఇటీవల అందరికి లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బే అనే భ్రమలోనే ఉంటున్నారు.
మన పూర్వీకులు
మన పూర్వీకులు కేవలం డబ్బు కోసం బతకలేదు. విలువలను బతికించుకుంటూ బతికారు. స్వార్థం, అసూయ వంటి వాటిని త్యజించారు. సక్రమమైన జీవన మార్గంలోనే వారు మోక్షం పొందారు. కానీ మనం అడ్డదారుల్లోనే వెళ్తున్నాం. ఎదుటి వాడికి ఏమైనా ఫర్వాలేదు మనం బాగా ఉంటే సరిపోతుంది అనే ధోరణిలో ఉంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మనలో కూడా మార్పు రావాలి. దైవ చింతనతో కాలం గడుపుతూ ఎదుటి వారికి ఎంతో కొంత సాయం చేస్తేనే మంచి జరుగుతుందని గ్రహించుకుంటేనే మంచిది.