Homeలైఫ్ స్టైల్Easy Fruit Trees For Home Garden: ఇంటి పరిసరాల్లో పండ్ల చెట్లను పెంచాలని అనుకుంటున్నారా..?...

Easy Fruit Trees For Home Garden: ఇంటి పరిసరాల్లో పండ్ల చెట్లను పెంచాలని అనుకుంటున్నారా..? కష్టం లేకుండా ఈ 5 చెట్లను పెంచవచ్చు..

Easy Fruit Trees For Home Garden: చెట్ల అంటే కొందరికి మహా ఇష్టంగా ఉంటుంది. వీటిని పెంచుకుంటూ సంరక్షించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే సిటీలో ఉండేవారు చెట్లను పెంచాలని కోరిక ఉన్న సరైన సదుపాయాలు ఉండవు. ముఖ్యంగా చెట్లను పెంచడానికి స్థలాలు అందుబాటులో ఉండవు. ఇలాంటివారు తక్కువ స్థలంలోనే ఆకర్షణీయమైన కొన్ని చెట్లను పెంచుకోవచ్చు. చెట్లను పెంచడంలో ఇప్పటికే అనుభవం ఉన్న వారితో పాటు కొత్తగా పెంచాలని అనుకునే వారికి ఈ రకమైన చెట్లతో అవసరమైన పండ్లను పొందవచ్చు. మరి అలాంటి చెట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

Also Read: ఓరేయ్ అమీరూ.. తల ఎక్కడ పెట్టుకుంటావ్.. వీడి తిట్లే టీమిండియా కు దీవెనలు

కీఫర్ క్లియర్ చెట్టు.. ఈ చెట్టు ఎలాంటి వాతావరణంలో నైనా పెరుగుతుంది. ఇది మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు పెరిగి ఆ తర్వాత పండ్లను అందిస్తుంది. దీనికి సంబంధించిన మొక్కలు నర్సరీలో అందుబాటులో ఉంటాయి. ఇలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని పెరుగుతాయి. కొత్తగా చెట్లు పెంచాలని అనుకునేవారు వీటిని పెంచడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ చెట్లు సీఎంగా పరాగసంపర్కం చేసుకోగలవు. అయితే ఈ చెట్లకు సమయపంలో మరో చెట్టును నాటడం వల్ల వీటి నుంచి అధిక ఉత్పత్తిని ఆశించవచ్చు. 12 నుంచి 20 అడుగుల పొడవుగా పెరిగే ఈ చెట్టు కు వారానికి కనీసం మూడుసార్లు నీరు పట్టాలి.

స్తంభ ఆపిల్….. సాధారణంగా ఆపిల్ చెట్లు పెంచుకోవాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అయితే తక్కువ స్థలంలో స్తంభ ఆపిల్ చెట్లను పెంచుకోవచ్చు. ఈ చెట్ల నుంచి ఆపిల్స్ రావడానికి నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. వీటిని కుండీల్లో కూడా పెంచవచ్చు. అయితే శీతాకాలంలో వీటిని బయట ప్రదేశంలో ఉంచడం మంచిది. ఒక సంవత్సరం తర్వాత ఈ చెట్టు ఏపుగా పెరగడం ప్రారంభమవుతుంది. 8 నుంచి 12 అడుగుల పొడవు ఉండే ఇది సారవంతమైన నేలల్లో పెంచితే క్రమం తప్పకుండా నీరు పట్టాలి.

చికాగో హార్డీ అంజీర్…. అంజీర్ పనులు శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ పండ్లను అందించే చెట్లు ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుకోవచ్చు. కాస్త పెరిగే వరకు వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇది సొంతంగా పెరుగుతుంది. ఇతర చెట్లతో పోలిస్తే అంజీర చెట్లకు కత్తిరింపు తక్కువగా ఉంటుంది. మూడు నుంచి ఐదు సంవత్సరాల తర్వాత ఇవి ఫలాలను అందిస్తాయి. చల్లటి వాతావరణం లో ఇవి తొందరగా పెరుగుతాయి. పది నుంచి 15 అడుగుల ఎత్తు పెరిగే వీటికి ఎండాకాలంలో సరైన నీరు క్రమం తప్పకుండా పట్టాలి.

స్టాండ్లీ ప్రూనే ప్లమ్ … ఈ చెట్టు పండ్లు విచిత్రంగా నీలి కలర్ లో కనిపిస్తాయి. ఇతర చెట్లతో పోలిస్తే వీటికి కత్తిరింపు తక్కువ అవసరం ఉంటుంది. మూడు సంవత్సరాల తర్వాత ఈ చెట్లకు పండ్లు కాస్తాయి. స్వీయ సంపర్కం చేసుకునే వీటిని కొత్తగా చెట్లు పెంచాలని అనుకునే వారు కూడా ఇంటి సమీపంలో మొక్కలు నాటవచ్చు. పండ్లు వచ్చే ముందు ఏర్పడే పువ్వులు ఆకర్షణీయంగా ఉంటాయి. 18 నుంచి 20 అడుగుల ఎత్తు ఉండే వీటికి సరైన విధంగా నీటిని పడుతూ ఉండాలి.

మేయర్ నిమ్మకాయ… సాధారణ నిమ్మ చెట్లు పెంచడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ మేయర్ నిమ్మకాయను అపార్ట్మెంట్లలో ఉండేవారు సైతం పెంచుకోవచ్చు. శీతాకాలంలో వీటిని బయట పెంచాల్సి ఉంటుంది. వీటి మొక్కలు నాటిన రెండు సంవత్సరాల తర్వాత నిమ్మకాయలు పెరగడం ప్రారంభమవుతాయి. ఇవి కూడా స్వీయ సంపర్కం చెందుతాయి కాబట్టి అనుకున్న పలాలు వస్తాయి. అయితే ఈ చెట్లను ఇంటికి దక్షిణం వైపు పెంచడం మంచిది. ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తు ఉండే వీటికి సూర్యకాంతి చాలా అవసరం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular