Money : డబ్బు సంపాదించాలనుకోవడం ముందునుంచే ప్లాన్ చేసుకోవడం మొదటి పాయింట్. చిన్నతనం నుంచే సంపాదన మొదలుపెట్టడం అలవాటు చేసుకోవాలి. ఖర్చులు ఎంత, ఎంత సంపాదించాలి అనేవి మీకు ఒక అవగాహన ఉండాలి. దానికోసం ఎలాంటి దారులున్నాయి. ఇలా అన్నింటి గురించి ఆలోచించుకోవడం వల్ల మీ టాస్క్ చాలా సులభం అవుతుంది. ముందునుంచి ప్లాన్ చేయడం వల్ల సంపాదించడం కూడా ఈజీ అవుతుంది అంటున్నారు నిపుణులు. కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం వల్ల మార్గం సులభం అవుతుంది బాస్.
కొంతమంది తలకి మించిన భారాలు ఉంటాయి. అనవసరమైన అప్పులు చేయడం కూడా కామన్ గా జరుగుతుంటాయి. దీంతో వచ్చిన డబ్బు మొత్తం అప్పు కడుతుంటారు. కాబట్టి, అనవసరమైనవాటి గురించి అప్పు చేయడం మానుకోవడం మంచిది. లేదంటే జీవితం మొత్తం అప్పులు కట్టడానికే సరిపోతుంది. ముందు నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మీరు జాబ్ చేసినా, వ్యాపారం చేసినా వచ్చే డబ్బులో నెలకి కనీసం 15 శాతాం అయినా సేవ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ మనీ కొన్ని రోజులకి మంచి సేవింగ్ అవుతుంది.
మన దగ్గర డబ్బు ఉంటే దేనికో ఒకదానికి ఖర్చు చేయడం కామన్. అందుకే సేవ్ చేయడం అలవాటు చేసుకోవాలి. దీనికోసం మీరు మీ జీతాన్ని పెంచుకునే మార్గాలు వెతకడం మంచిది. ఎక్స్ట్రా అవర్స్ డ్యూటీ చేయాలి. రెండో జాబ్, ఫ్రీలాన్సర్ వర్క్ చేయాలి. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం కావాల్సిన కోర్సులు ఎంచుకోవాలి. ఇలా చేస్తే మీరు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.
డబ్బు సంపాదించాలంటే ఇది ముఖ్యమైన విషయం. మీరు వేరేవారితో సమానంగా లగ్జరీ లైఫ్ మొదట్లోనే ఉండాలని కోరుకుంటే అప్పుల్లోనే కూరుకుపోతారు. మొదటగా మీరు డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంచుకోండి. అంతేకానీ, బ్రాండెడ్ బట్టలు, కాస్ట్లీ ఫోన్స్, గ్యాడ్జెట్స్ వంటి వాటి జోలికి వెళ్లకండి. డబ్బు సంపాదనపైనే మీ దృష్ఠిని సారించండి. మీరు కేవలం ప్రస్తుత జీవితానికి మాత్రమే పరిమితం కావొద్దు. రిటైర్ మెంట్ తర్వాత కూడా మీరు హ్యాపీగా ఉండేందుకు ఇప్పట్నుంచే ప్లాన్ చేయండి. దానికోసం అవసరమైన డబ్బు కూడబెట్టండి. కావాలంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకోండి.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Earn money easily how do you mean
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com