Life without Money: డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన వస్తువే. డబ్బు లేకుంటే జీవితం గడవదు. అయితే అందరికీ ఒకే రకంగా ఆదాయం ఉండదు. ఒకరికి తక్కువ.. మరొకరికి ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది. కానీ ఖర్చులు మాత్రం అందరికీ ఒకే రకంగా ఉంటాయి. ఇలాంటి అప్పుడు కొందరికి డబ్బు అవసరం ఉంటుంది. ఒకప్పుడు డబ్బు అవసరం ఉన్నప్పుడు ఇతరుల వద్ద చే బదులు లాగా తీసుకునేవారు. ఆ తర్వాత అప్పుగా తీసుకునేవారు. అయితే ఈ అప్పుపై వడ్డీని తీసుకుంటున్నారు. కానీ బంధువులు, స్నేహితులు, దగ్గర వారికి డబ్బు అవసరం ఉంటే ఇస్తున్నారు. వీటి కోసం వడ్డీ తీసుకోవడం లేదు. అయితే ఇలా అత్యవసరం ఉన్నప్పుడు కొందరికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వకూడదని చాణక్యనీతి తెలుపుతుంది. ఎందుకో తెలుసా?
చాణక్యుడు ఒక వ్యక్తి డబ్బులు ఎలా కాపాడుతాడు? ఎలా మెయింటైన్ చేస్తాడు? అనే విషయాలపై విపులంగా వివరించాడు. ఇదే సమయంలో డబ్బు ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని కూడా చెప్పాడు.
విచారంగా ఉండే వ్యక్తులకు డబ్బు ఎప్పుడూ ఇవ్వకూడదు. వీరికి డబ్బు ఇస్తే తిరిగి చెల్లించడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ డబ్బు తమకు సరిపోనట్లే భావిస్తారు. అంతేకాకుండా ఈ డబ్బు కోసం మరో వ్యక్తి వద్ద అప్పు చేసే అవకాశం ఉంది. ఇలా అప్పులు చేసే వ్యక్తికి డబ్బులు ఇవ్వడం వల్ల తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల విచారం ఉండే వ్యక్తులకు డబ్బు అవసరం ఉంటే ఇవ్వడం గురించి ఆలోచించాలి.
మూర్ఖుల గురించి దూరంగా ఉండటమే మంచిది. వీరికి డబ్బు అవసరం పడినా లేదని తప్పించుకోవడమే మంచిది. ఎందుకంటే వీరికి డబ్బు ఇస్తే తిరిగి ఇవ్వకుండా ఏవేవో కారణాలు చెబుతూ ఉంటారు. పైగా తమకే తెలివి ఉన్నట్లు వ్యవహరిస్తూ.. డబ్బు ఇవ్వడాన్ని దాటవేస్తూ ఉంటారు. ఎప్పుడూ డబ్బు ఇవ్వమని అడిగినా ఏదో ఒక కారణం చెప్తూ బాధను వ్యక్తం చేస్తుంటారు. అలా వారి వద్ద నుంచి డబ్బు తీసుకోకుండా ప్రయత్నాలు చేస్తారు.
ఎక్కువగా మద్యం అలవాటు ఉండే వారికి డబ్బు ఇవ్వడం మానుకోవాలి. ఎందుకంటే వీరికి డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు దాదాపు తక్కువే. ఎందుకంటే వీరు ఇచ్చిన డబ్బులను ఎక్కువగా మద్యం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు. ఒకవేళ వీరిని డబ్బు అడిగినా.. ఇవ్వడానికి ఇష్టపడరు. అందువల్ల ఇటువంటి వారికి డబ్బు ఇవ్వడం మానుకోవాలి.
ఇలాంటి బాధ్యతలు లేని వ్యక్తులకు కూడా డబ్బు ఇవ్వడం మంచి అలవాటు కాదు. ఎందుకంటే వీరు డబ్బు తీసుకున్నప్పుడు బాగానే ఉంటారు.. కానీ తిరిగి ఇచ్చేటప్పుడు నటిస్తుంటారు. పైగా వీరికి ఎలాంటి బాధ్యత ఉండదు కాబట్టి డబ్బు ఇచ్చే సమయంలో దూరంగా ఉంటారు.
ఇలా డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే ఉంటది. కానీ ఒక్కోసారి మంచి చేద్దామని ఇతరులకు డబ్బు ఇస్తే అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల డబ్బు విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి తెలుపుతుంది.