How to Make Money:మానవ జీవితం ఎంతో సులువైనదని కొందరు చెబుతుంటే.. కష్టసుఖాలతో పయనం ఉంటుందని మరికొందరు ప్రవచనాలు చేస్తుంటారు. అయితే ఈ జీవితాన్ని పూర్తి చేయడానికి కొందరు ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తారు.. మరికొందరు కొన్ని అలవాట్లను చేసుకొని వాటిని పాటిస్తూ జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ క్రమంలో కొందరు మేధావులు జీవిత సత్యాలను తెలుపుతూ ఉంటారు. వాటి గురించి తెలుసుకొని.. వాటిని ఫాలో అవుతూ జీవితాన్ని సక్రమ మార్గంలో ఉంచుకుంటారు. ఇలాంటి మేధావుల్లో చాణుక్యుడు ఒకరు. చాణక్యుడు చెప్పినా కొన్ని జీవిత సత్యాలను ఇప్పటికీ చాలామంది పాటిస్తున్నారు. ఆయన చెప్పిన ప్రకారం కొన్ని అలవాట్లు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ధనవంతులు కాలేరు. మరి ఆ అలవాట్లు ఏవో చూద్దాం..
Also Read: ఇంటికి దీపమే కాదు.. ఆదాయాన్ని పెంచేది కూడా ఇల్లాలే.. ఎలాగంటే?
అపర చాణక్యుడు రాజకీయ నీతి మాత్రమే కాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో రకాల విలువైన సూత్రాలను ప్రజలకు అందించారు. ఒక వ్యక్తి జీవితంలో డబ్బు సంపాదించడానికి.. సంతోషంగా ఉండడానికి ఎలాంటి అలవాట్లు ఉండాలో చెప్పాడు.. అలాగే ఒక వ్యక్తి ఎప్పటికీ పేదరికంగా ఉండడానికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో కూడా వివరించాడు. ఇప్పుడు మనం ఒక వ్యక్తి నిత్యం పేదరికంతోనే కొట్టుమిట్టాడుతూ ఉండే వారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో చూద్దాం..
కొందరు డబ్బు సంపాదించడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఏ చిన్న అవసరానికైనా ఇతరుల వద్ద చేయి చాచి అప్పు అడుగుతారు. ఆ అప్పులు తీర్చి మళ్లీ కొత్త అప్పులు చేస్తారు. ఇలా జీవితాంతం అప్పులు చేసేవారు ఎప్పటికీ పేదవారిగానే ఉండిపోతారు. అయితే ఇదే సమయంలో వీరు ఖర్చులు తగ్గించుకోవాలని ఆలోచించరు. ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుకుంటే.. అప్పులు తగ్గే అవకాశం ఉంటుంది.
చాణక్య నీతి ప్రకారం మూర్ఖులు కూడా ఎప్పటికీ పేదవారిగానే ఉండిపోతారు. వీరు తమ ఆర్థిక అభివృద్ధి కోసం ఇతరుల సలహాలు పాటించరు. తమకు నచ్చింది చేస్తారు. ఈ క్రమంలో వారు తీసుకుని నిర్ణయాలు కూడా సరిగా ఉండవు. అలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అయితే పెద్దలు చెప్పిన సలహాలు పాటించి.. మంచి నిర్ణయాలు తీసుకుంటే గట్టెక్కే అవకాశం ఉంది.
Also Read: భార్య విడాకుల కేసు పెట్టింది.. ఆ ఒక్క పనితో ఆమె మనసు మార్చేశాడు..
కొందరు డబ్బు తమ వద్ద ఎక్కువ లేకుండా అవసరానికి మించి ఆహారం తింటూ ఉంటారు. అయితే శరీరానికి సరిపోయేంత కాకుండా అవసరానికి మించి తినడం వల్ల అనారోగ్యం రావడమే కాకుండా డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది. దీంతో ఎప్పటికీ ఇంట్లో ధనం నిలిచే అవకాశం ఉండదు. ఇలా స్థాయికి మించి ఆహార పదార్థాలు తినడం వల్ల ఆ వ్యక్తి ఎప్పటికీ డబ్బు సంపాదించలేడు. ఎందుకంటే తాను తినడం కోసమే డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అలాకాకుండా మితంగా భోజనం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. ఫలితంగా ధనం కూడా వృధా అవకుండా ఉంటుంది.
నిజాయితీతో ఉండే వ్యక్తులు ఎప్పుడూ సమాజంలో గుర్తింపు పొందుతారు. కానీ కొందరు తప్పుడు పనులు చేస్తూ తమ స్వార్ధానికి మాత్రమే పనిచేస్తారు. అలా చేయడంవల్ల సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకొని ఎప్పటికీ ముఖ్యమైన పనులను పూర్తి చేయకుండా ఉంటారు. దీంతో వారు అవసరానికి డబ్బు సంపాదించలేరు.