https://oktelugu.com/

మీ పర్సులో డబ్బులు నిలవాలా.. అస్సలు పెట్టుకోకూడని వస్తువులు ఇవే..?

మనలో చాలామంది పర్సును వినియోగిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పర్సులో డబ్బులు మాత్రమే దాచుకుంటే మరి కొంతమంది మాత్రం పేపర్స్ లేదా బ్యాంక్ కార్డులను, ఇతర డాక్యుమెంట్లను దాచుకుంటూ ఉంటారు. కొంతమంది దేవుళ్ల ఫోటోలను సైతం పర్స్ లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పర్స్ లో డబ్బులు నిలవాలంటే కొన్ని వస్తువులను అస్సలు పెట్టుకోకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చనిపోయిన వాళ్ల ఫోటోలను, దేవుళ్ల ఫోటోలను పర్సులో పెట్టుకుంటే డబ్బులు నిలవవు. ఇలాంటి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 21, 2021 / 03:40 PM IST
    Follow us on

    మనలో చాలామంది పర్సును వినియోగిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పర్సులో డబ్బులు మాత్రమే దాచుకుంటే మరి కొంతమంది మాత్రం పేపర్స్ లేదా బ్యాంక్ కార్డులను, ఇతర డాక్యుమెంట్లను దాచుకుంటూ ఉంటారు. కొంతమంది దేవుళ్ల ఫోటోలను సైతం పర్స్ లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పర్స్ లో డబ్బులు నిలవాలంటే కొన్ని వస్తువులను అస్సలు పెట్టుకోకూడదు.

    జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చనిపోయిన వాళ్ల ఫోటోలను, దేవుళ్ల ఫోటోలను పర్సులో పెట్టుకుంటే డబ్బులు నిలవవు. ఇలాంటి ఫోటోలను పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఓం లేదా స్వస్తిక్ చిహ్నం ఫోటోలను మాత్రం పర్స్ లో పెట్టుకోవచ్చు. అయితే ఈ చిహ్నాలను మ్యూటిలేట్ చేయకూడదనే విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. పర్సులో అనవసర పేపర్లను ఉంచుకోకూడదు.

    పర్సు లక్ష్మీదేవి ఉండే చోటు కాబట్టి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యుటిలేటెడ్, పాత పేపర్లు, బిల్లులు పర్సులో పెట్టుకుంటే అప్పు పెరిగే అవకాశాలు ఉంటాయి. మురికి చేతులతో పర్సును ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. బ్లేడ్లు, చిన్న కత్తులు పర్సులో అస్సలు పెట్టుకోకూడదు. నోట్లు, నాణేలను పర్స్ లో వేర్వేరు చోట్ల ఉంచితే మంచిదని చెప్పవచ్చు.

    మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు పర్సులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదని గుర్తుంచుకోవాలి. మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు పర్స్ లో పెట్టుకోవడం వల్ల అత్యంత హీనమైన పేదరికం అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.