https://oktelugu.com/

వర్షాకాలంలో తినకూడని ఆహార పదార్థాలివే.. తింటే గుండె జబ్బులు?

సాధారణంగా ఇతర కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో అంటువ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. పిల్లలు, వృద్ధులు ఈ కాలంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాన్ని తీసుకుంటే మంచిది. ఈ కాలంలో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు కొన్ని ఆహారపదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి. వర్షాకాలంలో వాతావరణం మారడం, నీళ్లు మారడం వల్ల కూడా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 21, 2021 / 03:37 PM IST
    Follow us on

    సాధారణంగా ఇతర కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో అంటువ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. పిల్లలు, వృద్ధులు ఈ కాలంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాన్ని తీసుకుంటే మంచిది. ఈ కాలంలో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు కొన్ని ఆహారపదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి.

    వర్షాకాలంలో వాతావరణం మారడం, నీళ్లు మారడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉంటే మంచిది. చల్ల నీళ్లను తాగకుండా గోరువెచ్చని నీటిని తాగితే డయేరియా, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. మసాలాలు, నూనె ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. భోజనం చేసేముందు చేతులను తప్పనిసరిగా కడుక్కోవాలి.

    అవసరమైన మొత్తంలో ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వేపుళ్లు, స్పైసీ ఫుడ్, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. మరోవైపు కొన్ని ఆహారాలను వర్షాకాలంలో తినడం వల్ల ఆరోగ్య సమస్యలకు సులువుగా చెక్ పెట్టవచ్చు. వోట్స్ ను వర్షాకాలంలో తీసుకుంటే మంచిది. ఇందులో ఉండే పండ్లు, పోషకాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

    పుట్నాలు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఫ్రూట్ చాట్ తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. జీడిపప్పు, బాదం తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.