https://oktelugu.com/

Bed : పడుకునే ముందు ఈ పని అస్సలు చేయకండి.. ఎందుకంటే?

Bed : ప్రస్తుత కాలంలో చాలామందికి ఆరోగ్యంతో పాటు నిద్ర కూడా చాలా అవసరమే. ఎందుకంటే రకరకాల ఒత్తిడి, ఉద్యోగం వ్యాపారం కారణంగా చాలామంది నిద్రను పోవడం లేదు.

Written By: , Updated On : March 21, 2025 / 01:00 AM IST
Bed

Bed

Follow us on

Bed : ప్రస్తుత కాలంలో చాలామందికి ఆరోగ్యంతో పాటు నిద్ర కూడా చాలా అవసరమే. ఎందుకంటే రకరకాల ఒత్తిడి, ఉద్యోగం వ్యాపారం కారణంగా చాలామంది నిద్రను పోవడం లేదు. దీంతో అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు. అయితే నిద్రపోయే సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల వీరి నిద్రకు భంగం కలుగుతుంది. ఫలితంగా కళ్ళు మూసినా నిద్రపోవడం లేదు. అయితే నిద్రపోయేటప్పుడు కొన్ని టిప్స్ పాటించడం వల్ల నిద్రకు భంగం కలగకుండా ఉంటుంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఈ పనులు చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని కొందరు పండితులు చెబుతున్నారు. అసలు నిద్రపోయేటప్పుడు ఎలాంటి పనులు చేయాలి?

Also Read : తిన్న వెంటనే పడుకుంటున్నారా? అయితే ఇక మీ సంగతి అంతే..

పూర్వకాలం నుంచి చాలామంది నిద్రపోయే సమయంలో పక్కనే ఒక చెంబులో లేదా ఒక వాటర్ బాటిల్లో నీళ్లను పెట్టుకుంటూ ఉంటారు. రాత్రి సమయంలో దాహం వేసినప్పుడు వీటిని తాగడానికి అలా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ నీళ్ల పాత్ర లేదా బాటిల్ ను తలపైన ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ తలపైన ఉంచడం కంటే కాళ్ల దగ్గర ఏర్పాటు చేసుకోవడం మంచిది కానీ అంటున్నారు. తల వద్ద నీళ్ల బాటిల్ ఉండడంవల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. అలాగే ఇక్కడ నీరు ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ పాస్ అయి ఆరోగ్యం పై ప్రభావం పడుతుందని అంటున్నారు. అంతేకాకుండా తలపై నీళ్ల బాటిల్ ఉండడంవల్ల మెదడుపై ప్రభావం ఉంటుందని కూడా చెబుతున్నారు.

అందువల్ల ఏదైనా ఆహార పదార్థాలు లేదా నీళ్ల పాత్రలను కాలవద్ద ఉంచుకోవడం మంచిదని అంటున్నారు. అయితే కొందరు ఆధ్యాత్మిక ప్రకారం కాళ్ల వద్ద నీటిని ఉంచొద్దని చెబుతూ ఉంటారు. అలాంటి సమయంలో పక్కకు లేదా కాస్త దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. అయితే వృద్ధుల విషయంలో మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే రాత్రి సమయంలో వారికి దాహం వేసినప్పుడు పక్కనే నీరు ఉండడం వల్ల ఎంతో మంచిది. దూరం నీళ్లు ఉండడం వల్ల వారు తీసుకోవడానికి అనుగుణంగా ఉండదు. అంతేకాకుండా దాహం వేసినప్పుడు ఇతరులను పిలవడానికి ఆస్కారం ఉండదు. అందువల్ల వారికి వాటర్ బాటిల్లు పక్కనే ఉంచుకోవాలని చెబుతున్నారు. సాధారణ వ్యక్తులు మాత్రం వాటర్ బాటిల్ ని కాస్త దూరంగా పెట్టుకోవాలని చెబుతున్నారు.

నీళ్ల బాటిల్ మాత్రమే కాకుండా ఇంకా ఏ ఇతర వస్తువులు కూడా తల వద్ద ఉంచకూడదని అంటున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే వాటి ప్రభావం కచ్చితంగా మెదడుపై ఉంటుందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ తలపై ఉంటే దాని యొక్క రేడియేషన్ మెదడుపై పడి శరీరం వేడెక్కుతుంది. దీంతో ప్రతికూల ఆలోచనలు వచ్చి నిద్రకు భంగం కలుగుతుంది. అందువల్ల ఇట్టి పరిస్థితుల్లో మొబైల్ ను తల వద్ద ఉంచకూడదని చెబుతున్నారు. అయితే సాధ్యమైనంతవరకు నిద్రించే ముందే తగినన్ని నీటిని తీసుకొని పడుకోవాలి. చలికాలం అయితే తక్కువ నీటిని తీసుకోవాలి. వేసవికాలంలో ఎక్కువ నీటిని తీసుకుంటూ ఉండాలి. కానీ నీటిని తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

Also Read : నందిత తప్పులు.. నివేదితకు తిప్పలు.. రూ.1.46 కోట్ల ‘డబుల్‌’ సెగ!