Bed : ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితం కామన్ గా మారింది. ఎవరిని చూసినా సరే బిజీ బిజీగా లైఫ్ ను గడిపేస్తున్నారు. తినడానికి కూడా కొందరికి సమయం ఉండటం లేదంటే నమ్మండి బాబూ. డబ్బు వెనక పరుగెడుతూ వారి లైఫ్ ను కూడా మర్చిపోతున్న వారు ఎందరో ఉన్నారు. అందుకే ఒక్క ఒక్క క్షణం ఖాళీ దొరికితే చాలు కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నారు చాలా మంది. ఇక సెకండ్ షిఫ్టులు, జనరల్ షిఫ్టులు ఉన్న వారు కూడా అంతే రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకోవాలి అనుకుంటారు. ఉదయం మాట ఎలా ఉన్నా సరే కాస్త లైట్ తీసుకుంటారు కానీ ఇక రాత్రి మాత్రం అలా కాదు. తిన్న వెంటనే పక్క ఎక్కేస్తుంటారు. కానీ ఈ అలవాటు మాత్రం అసలు మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఇలా తిన్న వెంటనే పడుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఓ సారి చూసేద్దామా?
తిన్నవెంటనే పడుకోవద్దు. ఇలా పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా ఇబ్బంది కలిగుతుంది. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అలవాటు మానుకోవాలి. ఆహారం తీసుకోవడానికి పడుకోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల గ్యాప్ ఉండాలట.
రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతే మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఊబకాయం వస్తుంది. మరిన్ని తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక రాత్రి సమయంలో ఎక్కువగా ఆహారం తీసుకోవద్దు. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారమే తీసుకోవాలి. లేదంటే అవి జీర్ణం కావడానికి కూడా చాలా సమయం పడుతుంది. దీని వల్ల రాత్రి మంచి నిద్ర కూడా పట్టదు. మంచి నిద్ర కోసం కచ్చితంగా మీ ఆహారంలో మార్పు కూడా చేసుకోవాలి. లైట్ ఫుడ్, ఆరోగ్యకరమైన ఫుడ్ వల్ల ఆరోగ్యం మెరుగు అవుతుంది. అంతే కాదు మంచి నిద్ర కూడా మీ సొంతం అవుతుంది.
రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దు. లేదంటే జీర్ణ సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. రాత్రి సమయంలో జీర్ణక్రియ నెమ్మదిగా పని చేస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే పొట్ట ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది. అంతేకాదు గుండెల్లో మంట వస్తుంది. ఎసిడిటీ, కడుపులో మంట, గుండె సమస్యలు, గుండెలో మంట వంటి సమస్యలు వస్తాయి. మీరు ఇప్పటికే ఎసిడిటీతో బాధపడుతే తిన్న వెంటనే అసలు పాడుకోవద్దు.