https://oktelugu.com/

Ultraviolette:లాంచ్ అయిన వెంటనే రికార్డు బుకింగ్స్ సాధించిన ఎలక్ట్రిక్ స్కూటర్

Ultraviolette : అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రహ్మణ్యం ఈ సక్సెస్ మీద మాట్లాడుతూ..  “టెస్రాక్ట్‌కు అద్భుత స్పందన లభించింది.కేవలం రెండు వారాల్లోనే 50 వేల ప్రీ-బుకింగ్‌లను దాటడం నిజంగా అద్భుతం అన్నారు.

Written By: , Updated On : March 21, 2025 / 12:00 AM IST
Ultraviolette Electric Scooter

Ultraviolette Electric Scooter

Follow us on

Ultraviolette: ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోతూనే ఉంది. పర్యావరణ హితం, ఇంధన ఖర్చుల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనే వారి సంఖ్య పెరుగుతుంది. కస్టమర్ల ఆసక్తిని అదునుగా చేసుకున్న కంపెనీలు కొత్తకొత్త మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ అల్ట్రావయోలెట్ ఈ నెల ప్రారంభంలో టెస్రాక్ట్ అనే తన మొదటి స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్). టెస్సెరాక్ట్ కోసం ఇప్పుడు 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ప్రారంభమైన రెండు వారాల్లోనే ఈ మైలురాయిని సాధించింది.

Also Read : అట్లర్ ప్లాప్ గా హీరో స్ప్లెండర్, హోండా యాక్టీవా.. ఎలా అంటే ?

అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రహ్మణ్యం ఈ సక్సెస్ మీద మాట్లాడుతూ..  “టెస్రాక్ట్‌కు అద్భుత స్పందన లభించింది.కేవలం రెండు వారాల్లోనే 50 వేల ప్రీ-బుకింగ్‌లను దాటడం నిజంగా అద్భుతం అన్నారు. ఇది కేవలం మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ కాదు, ఇది ప్రజలు ప్రయాణించే విధానంలో ఒక చారిత్రాత్మక విప్లవం అన్నారు.

ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు
టెస్సెరాక్ట్ ఒకే వేరియంట్‌లో నాలుగు డిఫరెంట్ కలర్ ఆఫ్షన్లలో లభిస్తుంది. అవి డెసర్ట్ సాండ్, స్టీల్త్ బ్లాక్, సోనిక్ పింక్, సోలార్ వైట్. టెసెరాక్ట్ బుకింగ్ కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.999కి ప్రారంభమైంది. అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ టెక్నాలజీతో కంపెనీ నెక్ట్స్ జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు.దీనికి ముందు వెనుక 14-ఇంచుల వీల్స్ ఇచ్చారు. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. దీని ఫ్యూచరిస్టిక్ డిజైన్‌లో 7-ఇంచుల టచ్‌స్క్రీన్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మరిన్ని ఫీచర్స్ ఇచ్చారు.

రేంజ్, ఛార్జింగ్, స్పీడ్
సేఫ్టీ కోసం ఈ స్కూటర్‌లో డ్యూయల్ రాడార్, ముందు వెనుక కెమెరాలను ఇచ్చారు.  ఇవి బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్‌టేక్ అలర్ట్, యాక్సిడెంటల్ అలెర్ట్ అందిస్తాయి. ఇది డ్యూయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ ,  డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో సహా F77 నుంచి టెక్నాలజీని  కూడా కలిగి ఉంది.

టెస్సెరాక్ట్ మూడు బ్యాటరీ ప్యాక్ ఆఫ్షన్లలో లభిస్తుంది. అవి 3.5kWh, 5kWh, 6kWh. ఈ స్కూటర్ ఒక సారి ఛార్జ్ చేస్తే 261 కి.మీ. వరకు ప్రయాణించగలదు. ఇది కేవలం 2.9 సెకన్లలోనే 0 నుండి 60 కి.మీ./గం వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 125 కి.మీ. బ్యాటరీని 0 నుండి 80శాతం వరకు ఛార్జ్ చేయడానికి ఒక గంట కంటే తక్కువ సమయం పడుతుంది. ఈ స్కూటర్ డెలివరీలు 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి.

Also Read : హైబ్రిడ్ మోటార్ సైకిల్ అంటే ఏంటి.. యమహా FZ-S Fi ఫీచర్స్, ధర పూర్తి వివరాలివే