https://oktelugu.com/

Minor Driving e-Challan: ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది డ్రైవర్లు మైనర్లే.. ప్రభుత్వం షాకింగ్ నివేదిక

Minor Driving e-Challan : ప్రస్తుతం ప్రతి ఇంట్లో బైకో కారో ఉంటుంది. తల్లిదండ్రులకు వారి పిల్లలను వాటి మీద తిప్పుతుండడం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు ముద్దు కోసం, తమ మైనర్ పిల్లలకు కారు కీలను ఇస్తుంటారు. ఆ పై వారు దాని పరిమాణాలను అనుభవించాల్సి వస్తుంది.

Written By: , Updated On : March 21, 2025 / 02:00 AM IST
Minor Driving e-Challan

Minor Driving e-Challan

Follow us on

Minor Driving e-Challan: ప్రస్తుతం ప్రతి ఇంట్లో బైకో కారో ఉంటుంది. తల్లిదండ్రులకు వారి పిల్లలను వాటి మీద తిప్పుతుండడం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు ముద్దు కోసం, తమ మైనర్ పిల్లలకు కారు కీలను ఇస్తుంటారు. ఆ పై వారు దాని పరిమాణాలను అనుభవించాల్సి వస్తుంది. గత రెండేళ్లలో డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల మీద 1,497 ఈ-చలాన్లు జారి చేసినట్లు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంా తెలిపింది. ఇది మాత్రమే కాదు, ఈ చలాన్ల మొత్తం రూ.48 లక్షలు.

Also Read : మారుతి, హ్యుందాయ్ దారిలోనే మరో కంపెనీ.. ఏం చేసిందంటే

ఎక్కువ చలాన్లు ఎక్కడ జారీ చేయబడ్డాయి?
మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో రాష్ట్రాలు పంచుకున్న డేటా ప్రకారం బీహార్‌లో అత్యధికంగా మైనర్లకు ఈ-చలాన్లు జారీ చేశారు. కాంగ్రెస్ ఎంపీ నీరజ్ డాంగికి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వివిధ రాష్ట్రాల గురించి సమాచారాన్ని అందించారు. బీహార్‌లో 2023, 2024 సంవత్సరాల్లో అత్యధిక సంఖ్యలో చలాన్లు జారీ అయ్యాయి. అవి మొత్తం 1,316.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. గత రెండేళ్లలో ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మైనర్లు డ్రైవింగ్ చేసినందుకు విధించిన మొత్తం జరిమానా రూ.48 లక్షలు, ఇందులో 1,497 ఈ-చలాన్లు జారీ అయ్యాయి. బీహార్‌లో అత్యధికంగా రూ.44.3 లక్షల జరిమానా విధించినట్లు నివేదిక పేర్కొంది.

దీని తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో రూ.1.4 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1.3 లక్షల జరిమానా విధించారు. ఉత్తరాఖండ్‌లో 22 చలాన్‌లకు రూ.లక్షకు పైగా జరిమానా విధించగా, ఉత్తరప్రదేశ్‌లో కేవలం ఒక ఈ-చలాన్‌కు రూ.23,150 జరిమానా విధించారు.

మైనర్ డ్రైవింగ్ కు సంబంధించి ఆర్టీవో రూపొందించిన కొత్త డ్రైవింగ్ నిబంధనల ప్రకారం.. మైనర్ తండ్రిపై రూ.25,000 వరకు చలాన్ విధించడమే కాకుండా అలాంటి సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగితే కూడా జరిమానా విధించవచ్చు. అప్పుడు తండ్రి కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది. పూణేలో జరిగిన పోర్స్చే ప్రమాద కేసులో మైనర్ తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.