https://oktelugu.com/

Vastu Tips: అనారోగ్యాలకు, ఆర్థికంగా ఇబ్బంది పడటానికి ఇల్లు కారణం అవుతుందా?

గృహప్రవేశం తర్వాత లేదా ఏదైనా నిర్మాణాల ద్వారా చెడు జరిగితే కచ్చితంగా వాటికే లింక్ పెడుతారు. ఏ చిన్న నష్టం వచ్చినా, సమస్య వచ్చినా ఇంటి వల్లనే జరిగింది అంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 1, 2024 4:10 pm
    Vastu Tips:

    Vastu Tips

    Follow us on

    Vastu Tips: టెక్నాలజీ పెరుగుతున్నా కూడా ఇప్పటికీ మూఢ నమ్మకాలను వదలడం లేదు ప్రజలు. వింత ఆచారాలు, వింత పద్దతులతో ఇబ్బంది పడుతుంటారు కూడా. అయినా కూడా వారి ప్రవర్తనలో మార్పు రాదు. ఇక కొన్నిసార్లు చిన్న తప్పు జరిగినా, నష్టం జరిగినా కూడా లింక్ వేరే దగ్గర ఇస్తుంటారు. మిగిలిన వారు కూడా నిజమే కావచ్చు అని మరింత టెన్షన్ పడుతుంటారు. ఇలాంటి మూఢనమ్మకాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం. వీటి గురించి నిపుణులు ఏమంటున్నారో ఓ సారి చదివేసేయండి.

    గృహప్రవేశం తర్వాత లేదా ఏదైనా నిర్మాణాల ద్వారా చెడు జరిగితే కచ్చితంగా వాటికే లింక్ పెడుతారు. ఏ చిన్న నష్టం వచ్చినా, సమస్య వచ్చినా ఇంటి వల్లనే జరిగింది అంటారు. మీ తప్పును కప్పి పుచ్చుకోవడానికి మీరు చేసే మరో పెద్ద తప్పు ఈ కవరింగ్. కావాలని చెప్పకపోయినా ఈ మూఢనమ్మకాలు నిజం కావంటున్నారు నిపుణులు. అంతేకాదు ఆర్థికంగా నష్టపోవడానికి, అనారోగ్యాలు రావడానికి ఇల్ల నిర్మాణానికి సంబంధం ఉండదు అంటున్నారు.

    అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ముందుగా ఇల్లునే నిందిస్తారు కొందరు. మీరు తినే ఆహారం, చెడు వ్యసనాల వల్ల మాత్రమే ఆరోగ్యం పాడు అవుతుంది కానీ ఇంటి వల్ల అనారోగ్యం బారిన పడరు అంటున్నారు నిపుణులు. ఇంట్లో శుభ్రత లేకపోతే, చెత్తా చెదారం ఉంటే మాత్రమే మీరు అనారోగ్య పాలు అవుతారు. అనారోగ్యాలకు, ఆస్తులు కోల్పోవడానికి మీ పొరపాటు, లక్ష్య సాధనలో తప్పులు తప్ప ఇల్లు కారణం కాదట. మరి ఇప్పుడైనా కాస్త ఆలోచించి మెరుగైన ఫలితాలు వచ్చే మాదిరి కృషి చేయండి.

    చిన్న చిన్న విషయాలకు వాస్తు బాగలేదని, ఇంట్లో కిటికీలు, చెట్లు, వస్తువులు వాస్తుకు సరిపడా పెట్టలేదని నిందిస్తూ కాలక్షేపం చేయకుండా వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించి.. మళ్లీ ఆ సమస్య రాకుండా చూసుకోండి. మరి ఆల్ ది బెస్ట్.