Tea Biscuit Risks: చాలా మందికి ఉదయం లేవగానే టీ కావాలి. లేదంటే ఆ రోజంతా ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. వారి లైఫ్ లో టీ ఒక పార్ట్ గా మిగిలిపోతుంది కూడా. అంతలా ఇష్టపడుతారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రెండు, మూడు సార్లు అయినా టీ స్విప్ చేయాల్సిందే. లేదంటే హెడ్ కూడా వస్తుంది కొందరిలో. ఇదిలా ఉంటే టీతో పాటు బిస్కెట్ లను తినడం చాలా అలవాటు. ఇంతకీ ఛాయ్ బిస్కెట్ తినవచ్చా? లేదా ఓ సారి తెలుసుకోండి.
ఉదయం లేవగానే ఛాయ్. అందులోకి ఉస్మానియా బిస్కెట్ కావాల్సిందే చాలా మందికి. ఈ కాంబినేషన్ ను ఎక్కువ ఇష్టపడేవారే ఉంటారు. అయితే ఛాయ్ వల్ల 10 శాతం ఎసిడిటీ వస్తే ఈ బిస్కెట్ తో కలిపి టీ తాగితే మరో 50 శాతం ఎసిడిటీ ఎక్కువగా వస్తుందట. అంటే టీ తో పాటు బిస్కెట్ తింటే మరింత ఎక్కువ ఎసిడిటీ బారిన పడవచ్చు అన్నమాట.
ఇక మరో భయంకరమై వ్యాధి గురించి చెబితే మీరు జన్మలో టీ జోలికి వెళ్లరు కావచ్చు. కాస్త టీ బిస్కెట్ కాంబో ప్రియులు ఈ విషయం వినే ముందు గుండె జాగ్రత్తండోయ్.. నేను కూడా టీ లవర్ నే. అయితే టీ బిస్కెట్ కలిపి తింటే క్యానర్స్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. పంచదారతో తయారు చేసే ఈ టీలో ఏది కలిపి, ముంచుకొని తిన్నా కూడా అనారోగ్యమే అంటున్నారు. మరి జాగ్రత్త.
ఎసిడిటీ ఆ తర్వాత అల్సర్, ఆ తర్వాత మరింత డోస్ పెరిగి పెప్టిక్ అల్సర్ ఆ తర్వాత ఏకంగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందట. పాలల్లో బ్రెడ్ తింటారు చాలా మంది. ఇది ఆరోగ్యకరం కానీ టీ తో ఏ ఇతర పదార్థాలను కూడా తినవద్దట. ఈ బ్రెడ్ గోధుమ పిండితో చేస్తారు కాబట్టి పాలు, బ్రెడ్ కాంబినేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదట.