https://oktelugu.com/

Narendra Modi : మోదం.. ఖేదం.. కేంద్రంలో మోదీ తీన్మార్‌పై ఇదీ జనం మాట!

ఇక ఇండియా కూటమికి 2019లో పోలిస్తే సీట్లు పెరుగుతాయని సర్వే సంస్థలు తెలిపాయి. కానీ, అధికారం దక్కదని తేలిపోయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2024 / 04:31 PM IST

    Narendra Modi came to power for the third time at the Centre

    Follow us on

    Narendra Modi : దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. మరి కొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదో తేలిపోతుంది. అయితే అంతకు ముందు జూన్‌1న సాయంత్రం పలు ఏజెన్సీలు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు విడుదల చేశాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలు కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపాయి. అంటే మోదీ ప్రధానిగా తీన్మార్‌ కొట్టబోతున్నారన్నమాట. ఇక ఇండియా కూటమికి 2019లో పోలిస్తే సీట్లు పెరుగుతాయని సర్వే సంస్థలు తెలిపాయి. కానీ, అధికారం దక్కదని తేలిపోయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    భారత్‌వైపు ప్రపంచ దేశాల చూపు..
    మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని దాదాపు అన్ని సర్వే సంస్థలు తేల్చడంతో భారత ఎన్నికలను గమనిస్తున్న ప్రపంచ దేశాలు ఇది తమకు శుభ సంకేతంగా భావిస్తున్నాయి. రాబోయే ఏళలలో భారత్‌కు మరిన్ని భారీ పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఎందుకంటే మోదీ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

    ఆ పార్టీల్లో భయం..
    ఇక మోదీ రాక కొందరికి గిట్టడం లేదు. మోదీ ప్రధాని అయ్యాక చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఏతర ప్రభుత్వాలు కూలిపోయాయి. వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఎన్డీఏ యేతర పార్టీలు బీజేపీ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు బీజేపీ వ్యతిరేక పార్టీల్లో గుబులు రేపుతున్నాయి. మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్‌ సర్కార్లు, బెంగాల్‌లో మమత సర్కార్, ఒడిశాలో నవీన్‌పట్నాయక్‌ ప్రభుత్వాలకుముప్పు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    సెక్యులర్‌ వాదుల్లో టెన్షన్‌..
    ఇక సెక్యుల్‌ వాదులుగా చెప్పుకుంటున్నవారు కూడా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బీజేపీ మతం ప్రాతిపదికన రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. మూడోసారి మోదీ ప్రధాని అయితే దేశం పూర్తిగా హిందూ దేశంగా మారుతుందని పేర్కొంటున్నారు. మత ఘర్షణలు జరుగుతాయని ఆరోపిస్తున్నారు. మైనారిటీలపై దాడులు జరుగుతాయని ఆందోళన చెందతున్నారు. ఇలా మోదీ రాకను కొందరు శుభ పరిణామంగా భావిస్తుంటే.. మరికొందరు.. అశుభంగా భావిస్తున్నారు.

    స్టాక్‌మార్కెట్‌కు జోష్‌..
    ఇదిలా ఉంటే.. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు సోమవారం స్టాక్‌ మార్కెట్‌కు మంచి బూస్ట్‌ ఇచ్చాయి. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని తేల్చడంతో సెన్సెస్, నిఫ్టీ సోమవారం(జూన్‌3న) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ట్రేడింగ్‌ సెషన్‌లో సెన్సెస్, నిఫ్టీ కనీ వినీ ఎరుగని రీతిలో లాభాలతో ఓపెన్‌ అయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2,622 పాయింట్ల లాభంతో 76,583 వద్ద ఓపెన్‌ అయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 807 పాయింట్లు పెరిగి 23,338 వద్ద ఉంది. ఇక 1906 పాయింట్లు పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ 50,890 వద్ద ఓపెన్‌ అయింది.