Children: మంచి చేసినా చెడు చేసినా తిరిగా వాటికి సంబంధించిన మాటలు మాత్రం తల్లిదండ్రులకే వస్తాయి. చెడు చేస్తే మాత్రం తల్లిదండ్రి పెంపకం. అంటూ తిడుతుంటారు. మంచి చేసినా కూడా అలాగే అంటారు. మరి మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలో చాలా వరకు మీ చేతుల్లోనే ఉంటుంది. కొంత పక్కన ఉన్న వారిని చూసి నేర్చుకుంటే మీరు చేసే అలవాట్లు వారిని మరింత మంచి వారిగా మారుస్తాయి. అయితే మీరు నేర్పించాల్సిన ఆ అలవాట్లు ఏంటంటే..
సహాయం..
తమ చుట్టూ ఉన్నవారికి సహాయం చేయాలని నేర్పాలి. సహాయం చేయడంలో పిల్లలు ఎప్పుడూ ముందుండాలి అని నిత్యం చెబుతుంటాలి. ఆ దిశగా ప్రోత్సహించాలి. మీ పిల్లకు కేవలం మంచి అలవాటుగా మాత్రమే కాదు.. తల్లిదండ్రులుగా సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది. ఇలా చేయడం వల్ల మీ పిల్లలు ఒక బృందంగా ఏర్పడి పనిచేయడం కూడా నేర్చుకుంటారు.
భాగస్వామ్యం
తమ వస్తువులను మరొకరితో పంచుకోవడం కూడా ఖచ్చితంగా నేర్పాలి. అంతేకాదు ఇతరులతో సామరస్యంగా జీవించడం నేర్పాలి. ఇలాంటి అలవాట్ల వల్ల ఇతరులతో కలిసి పోయి, గొడవలు లేని వాతావరణం వారి మధ్యలో ఉండిపోతుంది.
Also Read: Homemade Curd: తియ్యని గడ్డ పెరుగు కావాలా? ఇదిగో మంచి టిప్
అందరినీ పలకరిస్తూ..
ఇతరులను కలవడం, వారితో మంచిగా మాట్లాడటం చాలా మంచి ప్రవర్తన. కాబట్టి మీ పిల్లలకు కూడా ఈ అలవాటు చేయండి. ఇలా చేయడం వల్ల అందరి మన్ననలు పొందడమే కాదు. మంచి వారు అనే పేరును కూడా సంపాదిస్తారు. ఎలాంటి సహాయం అయినా ఎలాంటి అవసరం లో అయినా మీ పిల్లల చుట్టు పది మంది ఉంటారు.
గౌరవం నేర్పించాలి
బయట వారిని గౌరవించాలి. అంతేకాదు బయటి వారితో పాటు ఇంట్లో ఉన్న పెద్దలను కూడా గౌరవించాలి. పెద్దలను కలిసినప్పుడు వారి ముందు ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి వారు చెప్పేది వినమని చెప్పాలి..
Also Read: June Month: జూన్ నెలకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే.. ఈ నెలలో ప్రత్యేక దినాలు ఇవే..
స్వేచ్ఛ
పిల్లలకు స్వేచ్ఛను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కానీ చెడు అలవాట్లకు కాదు.ఇక తినే విషయంలో గారాబం చేయడం కూడా మంచిది కాదు. వారే స్వయంగా తినడం బెటర్. కొన్ని సార్లు వారి పనులు వారు చేసుకోవడమే బెటర్. ప్రతి విషయంలో మీరు జోక్యం చేసుకోకండి.