https://oktelugu.com/

Using Car AC : కారులో AC ఎక్కువగా వాడుతున్నారా? ఈ విషయం వెంటనే తెలుసుకోండి..

కారులోని ఏసీని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో ఎక్కువ సేపు ఉన్న కారులో ఏసీ ఆన్ చేసినప్పుడు కాసేపు విండోస్ తెరిచి ఉంచాలి. ఎందుకంటే అప్పటికే క్యాబిన్ లోపల రకరకాల క్రిములు ఉంటాయి. ఇవి అలాగే ఉండగా ఏసీ ఆన్ చేస్తే శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి. ఏసీ ఆన్ చేసే ముందు ఫ్యాన్ వేసి లోపలి గాలి మొత్తం తీసేయాలి. ఆ తరువాత ఏసీ ఆన్ చేసుకోవాలి

Written By:
  • Srinivas
  • , Updated On : August 20, 2024 / 05:43 PM IST

    Using AC in Car

    Follow us on

    Using Car AC : నేటి కాలంలో చాలా మంది కారు కొనాలని చూస్తున్నారు. కార్యాలయ అవసరాలతో పాటు కుటుంబం కలిసి ప్రయాణం చేయడానికి కారు అనుగుణంగా ఉంటుంది. అందువల్ల మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం సొంత కారును కలిగి ఉంటున్నారు. అయితే కారు కొనే ముందు ఆ వెహికల్స్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. ఎందుకంటే కారు కొనడం కంటే ముఖ్యంగా దాని మెయింటెనెన్స్ బాగుండాలి అని అంటుంటారు. కారు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే లైఫ్ టైమ్ తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలం, వర్షాకాలంలో కారును జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఎలాంటి అదనపు ఖర్చులకు గురికాకుండా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న దాదాపు ప్రతీ కారులో ఏసీ కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దూర ప్రయాణం చేసేవారు ఏసీ లేకపోతే తట్టుకోలేదు. అయితే కారులో ఏసీ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే?

    కారులో AC తప్పనిసరిగా ఉండాలి. ఇది ప్రయాణికులు సౌకర్యం ఉండేందుకు అనుగుగుణంగా ఉంటుంది. మరోవైపు కారులో స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తుంది. అయితే ఏసీని ఉపయోగించాలంటే కారులో ఇంధనం ఎక్కువ కావాల్సి ఉంటుంది. సాధారణంగా కారు ప్రయాణంతో పాటు ఏసీని దృష్టిలో ఉంచుకొని ఇంధనాన్ని వాడుకోవాలి. కారులో ఏసీ వాడడం వల్ల ఎంత ఇంధనం ఖర్చు అవుతుంది? అనే విషయాన్ని కొందరు మాత్రమే గుర్తిస్తారు. అదెలాగ అంటే?

    ఒక కారు ఎండలో ఉన్నప్పుడు చల్లబడడానికి ఏసీని ఆన్ చేస్తూ ఉంటారు. అయితే పార్కింగ్ చేసిన కారు కంటే రన్నింగ్ చేసే కారులో ఇంధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. 2 లీటర్ ఇంజిన్ విషయంలో ఏసీని ఉపయోగిస్తే 0.5 నుంచి 0.7 లీటర్ల ఇంధనం అవసరం అవుతుంది. 1.2 లీటర్ నుంచి 1.5 లీటర్ ఇంజన్ కోసం అయితే 0.2 లీటర్ల నుంచి 0.4 లీటర్ల పెట్రోల్ అవసరం పడుతుంది. అయితే వేగం ఎక్కువగా ఉండి ఏసీ ఆన్ లో ఉండే ఇంధనం వీటి కంటే ఎక్కువగానే ఖర్చు అవుతుంది. అప్పుడు మైలేజ్ తగ్గుతుంది.

    కారు లో ఏసి ఆన్ చేయగానే ముందుగా క్యాబిన్ ను చల్ల బరుస్తుంది. అయితే క్యాబిన్ లో ప్రయాణికులు ఎక్కువగా ఉంటే ఏసీ ఎక్కువగా అవసరం ఉంటుంది.అలాగే వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో కారు చల్లబడడానికి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏసీ ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇక పాత కార్లతో పోలిస్తే కొత్త కార్లలో ఏసీ కోసం ఇంధనం తక్కువగానే ఖర్చు అవుతుంది. మొత్తంగా ఏసీ కోసం అదనంగా పెట్రోల్ వినియోగం అవుతుంది.

    కారులోని ఏసీని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో ఎక్కువ సేపు ఉన్న కారులో ఏసీ ఆన్ చేసినప్పుడు కాసేపు విండోస్ తెరిచి ఉంచాలి. ఎందుకంటే అప్పటికే క్యాబిన్ లోపల రకరకాల క్రిములు ఉంటాయి. ఇవి అలాగే ఉండగా ఏసీ ఆన్ చేస్తే శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి. ఏసీ ఆన్ చేసే ముందు ఫ్యాన్ వేసి లోపలి గాలి మొత్తం తీసేయాలి. ఆ తరువాత ఏసీ ఆన్ చేసుకోవాలి.