Using Credit Card :  Credit Card వాడే వారికి హెచ్చరిక..! ఈ 5 విషయాలపై నిర్లక్ష్యం వద్దు..

క్రెడిట్ కార్డు వాడేవారు కొన్ని విషయాలపట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ 5 విషయాల్లో అస్సలు నిర్లక్ష్యంగా ఉండొద్దు అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో చూద్దాం..

Written By: Chai Muchhata, Updated On : August 20, 2024 5:52 pm

Using Of Credit Cards

Follow us on

Using Credit Card : ప్రస్తుత కాలంలో సామాన్యుల వద్ద కూడా క్రిడిట్ కార్డులు ఉంటున్నాయి. వస్తు సేవల కోసం సమయానికి డబ్బులు లేకపోతే ఇతరులను అప్పు అడగకుండా క్రెడిట్ కార్డు ఆపన్న హస్తంలా ఆదుకుంటుంది. ఎలాంటి వడ్డీ లేకుండా ఈ కార్డు ద్వారా కొన్ని నగదు అవసరాలు తీర్చుకోవచ్చు. అయితే క్రెడిట్ కార్డు వాడడం వల్ల ఎన్ని ప్రయోజాలు ఉన్నాయో? అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే క్రెడిట్ కార్డు పై సరిగ్గా అవగాహన లేకపోవడంతో చాలా మంది మోసపోయారు. అయితే క్రెడిట్ కార్డు వాడేవారు కొన్ని విషయాలపట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ 5 విషయాల్లో అస్సలు నిర్లక్ష్యంగా ఉండొద్దు అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో చూద్దాం..

క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేయొచ్చే. సమయానికి చేతిలో డబ్బులు లేకున్నా వస్తువులు కొనుగోలు చేయొచ్చు. అయితే ఈ కార్డును ఇలాగే కాకుండా రుణం కూడా తీసుకోవచ్చు. కార్డుపై ఇచ్చిన లిమిట్ ఆధారంగా రుణ సాయం చేస్తారు. ఈ రుణం తీసుకునేటప్పుడు వాటిపై ప్రాసెస్ ఫీజు ఎంత పడుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలి. కొన్ని లోన్లపై నో ప్రాసెసింగ్ సౌకర్యం ఉంటుంది. ఇలాంటి లోన్లను ఉపయోగించుకోవడం వల్ల అదనపు భారం తగ్గుతుంది. అందువల్ల ముందుగా ప్రాసెజ్ ఫీజును కచ్చితంగా తెలుసుకోవాలి.

క్రెడిట్ కార్డును వివిధ అవసరాల కోసం వినియోగిస్తాం. నిర్ణీత సమయంలో బిల్ జనరేట్ అవుతంది. అయితే గడువు తేదీలోపల బిల్లు కచ్చితంగా చెల్లించే ఏర్పాటు చేసుకోండి. లేకపోతే సంబంధిత బ్యాంకులో డబ్బులు వేసి రెడీగా ఉండండి. ఒక్కసారి డబ్బులు చెల్లించక పోతే సిబిల్ స్కోరు తగ్గిపోతుంది. దీంతో కొన్ని ఆఫర్స్, ఇతర డిస్కౌంట్లకు అర్హులు కాకుండా పోతారు.

క్రెడిట్ కార్డు ఉన్న వారు సిబిల్ స్కోరు బాగుండేలా చూసుకోవాలి. అంటే కార్డును ఏదో రకంగా ప్రతినెలలో కొన్నిసార్లు అయినా వాడాలి. లేకపోతే ఇది హోల్డ్ లో పడుతుంది. ఒక్కసారి కార్డు డియాక్టివేట్ అయితే మళ్లీ పెద్దప్రాసెస్ ఉంటుంది. అందువల్ల ఆ అవసరం రాకుండా లిమిట్ గా వాడుతూ ఉండాలి. బ్యాంకుకు గుడ్ కస్టమర్ గా ముద్రపడితే ఆఫర్లు ఎక్కువగా వర్తిస్తాయి.

క్రెడిట్ కార్డుపై రుణం తీసుకున్నట్లయితే గడువుతేదీలోగా ఈఎంఐని చెల్లించాలి. అలా చెల్లించకుండా నిర్లక్ష్యంగా ఉంటే డిపాల్టర్ గా ముద్ర పడుతుంది. దీంతో కొత్త కార్డులు ఇవ్వడానికి బ్యాంకులు ఆలోచిస్తాయి. అంతేకాకుండా ఈఎంఐని మిస్ చేస్తే కనీసం 36 శాతం వరకు వడ్డీ రేటును వసూలు చేస్తాయి. వీటితో పాటు వివిధ రకాల ఫెనాల్టీలు కలిపి మొత్తంగా రూ. 2 వేలకు పైగా వసూలు చేస్తారు.

క్రెడిట్ కార్డుపై రుణం తీసుకోవాలనుకుంటే వడ్డీ రేటు గురించి పూర్తిగా తెలుుకోండి కొన్ని కార్డులపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. మరికొన్ని ఆఫర్ల కింద వడ్డీ రేటు తగ్గించేస్తారు. ఇలా తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పడు లోన్ తీసుకోవడం వల్ల ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక కార్డులపై ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. అలాంటి కార్డులు తీసుకోవడానికి ప్రయత్నించాలి.