Mobile Side Effects: మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు పాటిస్తే ఫోన్ జోలికి వెళ్లరు..

మొబైల్ ఆన్ చేయగానే స్క్రీన్ లైట్ వెలుతురు ఒక్కసారిగా వస్తుంది. ఇది కళ్లపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా మొబైల్ లో రంగురంగుల యాప్స్ ఉంటాయి.

Written By: Chai Muchhata, Updated On : December 10, 2023 11:19 am

Mobile Phone Side Effects

Follow us on

Mobile Side Effects: నేటి కాలంలో మొబైల్ లేని చేతులు కనిపించవు. ప్రతీ అవసరానికి ఫోన్ తప్పని సరి అయింది. అయితే ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. ఆరోగ్యంపై అంతకంటే కంటే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. కొందరు కార్యాలయాల కోసం మొబైల్ ను యూజ్ చేస్తే మరికొందరు కాలక్షేపం కోసం వాడుతున్నారు. ఏదీ ఏమైనా ఫోన్ వాడకం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఉన్నాయని ఇప్పటికే చాలా మంది ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. అయినా ఫోన్ లేకుండా జీవితం గడవడం సాధ్యం కావడం లేదు. అయితే ఫోన్ వాడకాన్ని తగ్గించే కొన్ని చిట్కాలు ఉన్నాయి. దీంతో కొంత వరకు మొబైల్ కు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కొందరు సూచిస్తున్నారు. అవేంటంటే?

బ్లాక్ మోడ్..:
మొబైల్ ఆన్ చేయగానే స్క్రీన్ లైట్ వెలుతురు ఒక్కసారిగా వస్తుంది. ఇది కళ్లపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా మొబైల్ లో రంగురంగుల యాప్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా చూడడం వల్ల కళ్లు మండినట్లు అవుతాయి. అయితే ఫోన్ లైట్ కళ్లపై పడకుంగా జాగ్రత్త పడాలి.అందుకు మొబైల్ లోని డిస్ ప్లే ఆప్షన్ లోకి వెళ్లి బ్లాక్ మోడ్ సెట్ చేసుకోవాలి. ఇది కొంద వరకు ఫోన్ ప్రభావానికి గురి కాకుండా కాపాడుతుంది.

అనవసరపు యాప్స్:
మొబైల్ లో ఎక్కువగా యూజ్ చేయని యాప్స్ చాలా వరకు ఉంటాయి. కొన్ని ఆటోమేటిక్ గా ఇన్ స్టాల్ అవుతూ ఉంటాయి. అవసరం లేని యాప్స్ డెలిట్ చేయాలనే మెసేజ్ వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా వాడని యాప్స్ ను తీసేయడం బెటర్. ఇవి ఉండడం వల్ల ఫోన్ వెయిటేజ్ ఎక్కువగా పడుతుంది. అంతేకాకుండా ఈ యాప్స్ ను స్రోల్ చేయడం ద్వారా కళ్లకు ఇబ్బందిగా మారుతుంది.

తక్కువ డిస్ ప్లే:
చాలా మంది మొబైల్ క్లియర్ కావడానికి డిస్ ప్లే మోడ్ 100 శాతం సెట్ చేసుకుంటారు. ఫోన్ లో ఉండే బ్లూ స్క్రీన్ కళ్లపై పడుతుంది. దీంతో చూపులో ఇబ్బందులు ఏర్పడుతాయి. అయితే డిస్ ప్లే కనీసం 30 శాతం అంతకంటే తక్కువగా సెట్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ రాత్రి సమయంలో పెంచుకుంటే సరి.

నోటిఫికేషన్ ఆఫ్:
ఫోన్ లో ఉండే చాలా యాప్స్ పలు నోటిఫికేషన్లు ముందుంచుతాయి. అయితే అవసరం లేని కొన్నింటికి ఆఫ్ మోడ్ లో పెట్టుకోవాలి. పదే పదే నోటిఫికేషన్ రావడంతో ఫోన్ ను చూడాల్సి వస్తుంది. అదే ఆఫ్ చేయడం వల్ల ఫోన్ జోలికి వెళ్లకుండా ఉంటారు. ఇక ఈ నోటిఫికేషన్ సౌండ్ ను కూడా ఆప్ చేయడం చాలా మంచిది. లేదా ముఖ్యమైన పనులకు ఆటంకం ఏర్పడుతాయి.

ఫోన్ కంటే బుక్ బెటర్:
చాలా మంది ఫోన్ ద్వారా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. కొన్ని పుస్తకాల్లో దొరికేవి సైతం ఆన్ లైన్లో చదవాలనుకుంటారు. కానీ ఫోన్ కంటే బుక్ ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కళ్లపై వెయిట్ పడకుండా ఉంటుంది. అందువల్ల కొన్ని విషయాలు సాధ్యమైనంత వరకు బుక్ లేదా న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకోవడం ఉత్తమం.