spot_img
Homeలైఫ్ స్టైల్Oversleeping causes: అవసరమైనంత మాత్రమే నిద్రపోండి.. లేకుంటే ఈ సమస్యలు..

Oversleeping causes: అవసరమైనంత మాత్రమే నిద్రపోండి.. లేకుంటే ఈ సమస్యలు..

Oversleeping causes: మనిషి ఆరోగ్యానికి సరైన నిద్ర చాలా అవసరం. అయితే ఏదైనా అవసరానికి మించితే ప్రమాదమే అని గుర్తించాలి. అలాగే నిద్ర కూడా అవసరానికి మించితే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వైద్యులు తెలుపుతున్న ప్రకారం ప్రతిరోజు ఏడు నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. ఇలా నిద్ర గడియారం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. కానీ ఈ గంటలకంటే ఎక్కువసేపు నిద్రపోతే మానసిక ఒత్తిడితోపాటు శారీరక చురుకుదనం తగ్గిపోతుందని అంటున్నారు. ఇవే కాకుండా ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఇన్సులిన్ ను నియంత్రించే హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా శరీరం గ్లూకోస్ ను సరిగా వినియోగించుకోలేక పోతుంది. ఇది క్రమంగా టైప్ 2 డయాబెటిస్ కు దారితీస్తుంది. మహిళల్లో నిద్ర ఎక్కువ అయితే సంతానోత్పత్తి సమస్యలు కూడా ఉంటాయి. అలాగే హార్మోన్ల అసమర్థులత ఉండడంతో నెలసరి సమస్యలు ఉంటాయి. థైరాయిడ్ వంటి హార్మోన్ సంబంధిత సమస్యలు ఎక్కువగా నిద్రతో ముడిపడి ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా మంచం పైనే ఉండడం వల్ల కండరాలు, నరాలు సంకోచించి శరీరం గట్టిగా అలసటగా అనిపిస్తుంది. ఉదయం లేవగానే తాజాతనాన్ని కోల్పోతారు. అలాగే నీరసంగా ఉంటూ ఏ పని చేయడానికి ఆసక్తిగా ఉండదు. తలనొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి.

ఎక్కువగా నిద్రపోతే మానసికంగా కృంగిపోతుంటారు. అవసరానికి మించి డిప్రెషన్ ఉంటుంది. దీంతో ఒంటరిగా ఉండాలనిపించడం.. పనిపై ఆసక్తి తగ్గడం.. నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా రావడం వంటివి ఉంటాయి. ఒకదానికొకటి సమస్యలు ముడిపడి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి. ఎక్కువగా నిద్రపోవడం వల్ల ప్రధానంగా బరువు కూడా పెరుగుతూ ఉంటారు. శారీరకంగా చురుకుదనం తగ్గి ఎక్కువ పోషకాహారాలు తీసుకోవాలని అనిపిస్తుంది. ఇదే సమయంలో జంక్ ఫుడ్ కు అలవాటు పడతారు. అధిక కేలరీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. దీంతో ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవి గుండెజబ్బుకు దారితీస్తుంది..

అందువల్ల మానవ శరీరానికి అవసరమైన నిద్ర మాత్రమే ఉండాలి. అంతకుమించితే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోయి.. ఒకే సమయంలో నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు నిద్రపోయినా కూడా జీవ గడియారం దెబ్బతింటుంది. ఫలితంగా మానసిక, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version