spot_img
Homeలైఫ్ స్టైల్quality sleep habits: నాణ్యమైన నిద్ర పట్టాలంటే.. ఈ 5 అలవాట్లు తప్పనిసరి..

quality sleep habits: నాణ్యమైన నిద్ర పట్టాలంటే.. ఈ 5 అలవాట్లు తప్పనిసరి..

quality sleep habits: మనిషి ఆరోగ్యానికి నాణ్యమైన ఆహారం మాత్రమే కాకుండా.. సరైన నిద్ర తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో రకరకాల కారణాల వల్ల చాలామంది సరైన నిద్ర పోవడం లేదు. కొందరు ఉద్యోగ, వ్యాపార రీత్యా ఒత్తిడితో ఆరోగ్యకరమైన నిద్ర పోకుండా ఉంటే.. మరికొందరు మొబైల్ స్క్రీన్లతో ఎక్కువగా గడుపుతూ రాత్రులు ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఇలాంటి వారికి సరైన నిద్ర పట్టే అవకాశం ఉండదు. నాణ్యమైన నిద్ర లేకపోవడం వల్ల మానసికంగా ఆందోళన ఉండడంతో పాటు.. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం ప్రత్యేకమైన అలవాట్లు చేసుకోవడం ద్వారా చక్కటి నిద్ర వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి అలాంటి అలవాట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకే సమయానికి పడుకోవడం, నిద్ర లేవడం వంటి అలవాటు చేసుకోవాలి. కొంతమంది ఆలస్యంగా నిద్రపోతూ.. ఉదయం తొందరగా మేల్కొంటారు. ఇలాంటి వారిలో మానసిక సంఘర్షణ జరిగి తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. వేర్వేరు సమయాల్లో పడుకోవడం, నిద్ర లేవడం వల్ల అలసటగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోయి.. ఒకే సమయానికి నిద్ర లేవడం చాలా మంచిది అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

నిద్రపోయేటప్పుడు గది వాతావరణాన్ని ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా గది వెలుతురు, చీకటి ప్రభావంతో కూడా మానవ శరీర హార్మోన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. పడుకునే గది పూర్తిగా చీకటిగా, నిశ్శబ్దంగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాంటి పరిస్థితులు లేకపోతే ఐ మాస్క్ ను ధరించి నిద్రపోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మెదడుకు హాయిగా ఉంటుంది.

రకరకాల కారణాలవల్ల చాలామంది రాత్రిళ్ళు ఆలస్యంగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇలా ఆహారం తిన్న వెంటనే కొందరు నిద్రిస్తూ ఉంటారు. అలా చేయడంవల్ల జీర్ణవ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలి. అంతేకాకుండా రాత్రి సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం. అలా చేయని పక్షంలో నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంటుంది.

కొంతమంది పడుకుని ముందు మద్యం సేవించి నిద్రిస్తారు. కానీ వాస్తవానికి ఇలా చేయడం వల్ల నిద్ర భంగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిద్రించాలని అనుకునే మూడు లేదా నాలుగు గంటల ముందే మద్యం తీసుకోవడం వల్ల నిద్ర భంగం కలగకుండా ఉంటుంది. మధ్యలో ఉండే మత్తుతో కాసేపటి వరకు నిద్రపోయిన కూడా.. ఆ తర్వాత మానసికంగా అలజడితో ఉంటారు.

ఉదయం లేవగానే వ్యాయామం చేయడంతో పాటు సూర్యరశ్మిలో ఉండే అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం రీఛార్జ్ అయినట్లు అనిపిస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కనీస 30 నిమిషాల పాటు సూర్యరష్మి లో ఉండే విధంగా ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల రాత్రి నాణ్యమైన నిద్ర పట్టి అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version