Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ నడుస్తూ ఉంటుంది. ఆమెను సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా అభిమానులు నిత్యం ఫాలో అవుతూ ఉంటారు. ఆమె షేర్ చేసిన ఫొటోలు, వీడియోలకు కామెంట్లు పెడుతూ ఉంటారు. పెళ్లయి విడాకుల తరువాత సమంత స్వేచ్చగా విహరిస్తోంది. హద్దు పద్దు లేకుండా అన్ని రకాల సినిమాల్లో నటిస్తోంది. అవసరమైతే బోల్డ్ షో చేయడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో బోల్డ్ తరహాలో కనిపిస్తున్న అమ్మడును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరోసారి సమంత ఇలా రెచ్చిపోయిందేంటి? అంటూ కామెంట్ పెడుతున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఇలా ఎందుకు కనిపించిందంటే?
కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న సమంత మళ్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో విజయ్ దేవరకొండతో నటించిన ‘ఖుషి’ డిజాస్టర్ తెచ్చిన తరువాత అమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. గతంలో ఫ్యామిలీ మ్యాన్ 2 అనే సిరీస్ లో నటించిన సమంతకు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు వచ్చింది. దీంతో వెబ్ సిరీస్ లను ఏమాత్రం వదలడం లేదు. కొంతకాలంగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నించిన ఆమెకు ఇటీవల కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.

అయితే ఇంతలో సమంత రూత్ ప్రభు హాట్ హాట్ ఫొటోలను ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. జీన్స్ వేయిర్ చేసిన ఆమె ఇందులో తన ఎద అందాలను చూపిస్తూ కొంటే చూపులతో కవ్విస్తోంది. గతంలో ఇలాంటి పిక్స్ ఎన్నో రిలీజ్ చేసినా..లేటేస్టుగా సమంత కొత్త లుక్ లో కనిపించే సరికి యూత్ ఆగలేకపోతున్నారు. ఆమె ఫొటోలకు లైకులు, కామెంట్లు పెడుతున్నారు. రియాలిటీ షో ఎంటీవీ హాస్టిల్ కొత్త సీజన్ ను ప్రారంభిస్తోంది. ఇందులో సమంత కైడెన్ శర్మ యొక్క ర్యాప్ కు గాడితో పాటు ప్రోమోను కూడా పంచుకున్నారు.

కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తరువాత మళ్లీ యథాస్థానానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫేస్ లో గ్ల రావడంతో పాటు యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం బిజీ షెడ్యూల్ గడుపుతుండడంతో సమంత రాను రాను బాలీవుడ్ లో అవకాశాలు తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అందుకే ఈ బ్యూటీ ఇంతలా రెచ్చిపోతుందని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేవు. అయితే బాలీవుడ్ లో ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.