Bigg Boss 7 Telugu: వీడియో ప్రూఫ్ తో శోభ బండారం బయటపెట్టిన నాగార్జున… నో సౌండ్!

మొదట శోభా శెట్టి ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. ఆమెకు ఓ వీడియో చూపించారు నాగార్జున. అందులో ఈ శనివారం నాగార్జున సార్ ముందు A - Z తీయకపోతే నా పేరు శోభా శెట్టి కాదు అంటూ శోభా ప్రియాంక తో చెప్పింది.

Written By: NARESH, Updated On : December 10, 2023 11:01 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో 14వ వారం జరిగిన గొడవలు ..రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో ఆడియన్స్ వీకెండ్ ఎపిసోడ్ కోసం తెగ ఎదురు చూశారు. నాగార్జున ఎప్పుడు వచ్చి వాళ్లకు బుద్ధి చెప్తాడా అని ఎంతో ఆశగా ఎదురు చూసిన సమయం వచ్చేసింది. తాజా ప్రోమోలో నాగార్జున .. శోభ ను కడిగి పారేశాడు. వారం మొత్తం శోభా చేసిన ఓవర్ యాక్షన్ ని వీడియోలు వేసి చూపించి మరీ ఉతికేసారు నాగ్.

మొదట శోభా శెట్టి ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. ఆమెకు ఓ వీడియో చూపించారు నాగార్జున. అందులో ఈ శనివారం నాగార్జున సార్ ముందు A – Z తీయకపోతే నా పేరు శోభా శెట్టి కాదు అంటూ శోభా ప్రియాంక తో చెప్పింది. ఆ నువ్వు శోభా శెట్టే అమ్మ ..తియ్ ఇప్పుడు A -Z అంటూ నాగ్ అడిగారు. ఇక శోభా ‘ సార్ నన్ను ఫేవరిజం అంటున్నారు. అసలు నేనేం చేశాను అనగానే .. నాగార్జున ‘ సంచాలక్ గా నువ్వేం చేసావ్ .. సంచాలక్ అంటే ఒక జడ్జి అంటూ నిలదీశారు.

దానికి శోభా ఏదో కవర్ చేయడానికి ట్రై చేసింది. ప్రియాంక కి సపోర్ట్ చేయడం కరెక్ట్ అని కాసేపు వాదించింది. మరి కరెక్ట్ అంటూ నువ్వే ఒప్పుకున్నావ్ .. వాళ్లు అనకుండా ఎందుకు ఉంటారు అని అన్నారు. దీంతో శోభా ఏడుస్తూ .. సార్ ఈ వీక్ మొత్తం నేను చాలా డిస్టర్బ్ అయ్యాను అంటూ పర్ఫామెన్స్ మొదలు పెట్టింది. అవును నువ్వు డిస్టర్బ్ అవ్వడమే కాకుండా హౌస్ లో అందరిని రెచ్చగొట్టావు. యావర్ గట్టిగా కొట్టాడని చెప్పావ్ కదా అని నాగార్జున అడిగారు.

నేను అనలేదు సార్ అని చెప్పడంతో .. ఆ వీడియోను ప్లే చేశారు. దీంతో ఇక తప్పు బయట పడేసరికి తలదించుకుని ఏడ్చేసింది శోభా శెట్టి. ఆ తర్వాత యావర్ – శోభా గొడవ గురించి నాగ్ ఫైర్ అయ్యాడు. బాల్స్ టాస్క్ లో యావర్ ..ఛీ .. థూ అని శోభా ను అన్న వీడియో చూపించారు. ఛీ .. థు అంటూ యావర్ పై మండి పడ్డారు నాగార్జున. దీంతో యావర్ ఏం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు.