Suryakumar Yadav: ఉస్మాన్ తారిఖ్.. ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో అత్యంత వివాదాస్పరమైన బౌలర్ గా ఆవిర్భవించాడు.
టీమిండియాతో టి20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఇతడి గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇతడిని ఎలా ఎదుర్కోవాలో మాజీ క్రికెటర్లు.. టీమిండియా క్రికెటర్లకు హితబోధ చేస్తున్నారు.
ఉస్మాన్ తారిఖ్ ను ఎదుర్కొనే క్రమంలో ఎటువంటి విధానాలు అవలంబించాలి, ఏ తరహాలో అతడికి చెక్ పెట్టాలి.. అనే అంశాలపై టీమ్ ఇండియా క్రికెటర్లు తీవ్రంగా మదనం చేస్తున్నారు. కొలంబో క్రికెట్ స్టేడియంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఉస్మాన్ తారిఖ్ ను ఎదుర్కోవడానికి టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్వయంగా రంగం లోకి దిగాడు. ఏకంగా బౌలర్ అవతారం ఎత్తాడు. అంతేకాదు ఉస్మాన్ తారిఖ్ మాదిరిగా బౌలింగ్ వేసాడు.
టీమిండియా క్రికెటర్లకు మొత్తం సూర్య కుమార్ యాదవ్ ఉస్మాన్ తారిఖ్ మాదిరిగా బౌలింగ్ వేశాడు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ వుంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ మీద తీవ్రంగా దృష్టి పెడతాడు. కానీ, పాకిస్తాన్ జట్టుజరిగే మ్యాచ్ విషయంలో మాత్రం సూర్య కుమార్ యాదవ్ కేవలం బౌలింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టాడు. అది కూడా ఉస్మాన్ తారిఖ్ మాదిరిగా బౌలింగ్ వేశాడు.
సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ లో టీమిండియా బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. మొదట్లో కొన్ని బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడినప్పటికీ.. ఆ తర్వాత టీమ్ ఇండియా బ్యాటర్లు ఏమాత్రం భయపడకుండా బ్యాటింగ్ చేశారు.
ఐసీసీ నిర్వహించే మేజర్ టోర్నీలలో పాకిస్తాన్ జట్టుపై టీమిండియా కు అద్భుతమైన రికార్డు ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీలలో టీమిండియా ఏకపక్షమైన విజయాలు సాధిస్తోంది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీమిండియా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది.
దాయాది పాకిస్తాన్ జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని కృత నిశ్చయంతో ఉంది. అందువల్లే ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ ను భారత బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సూర్య కుమార్ యాదవ్ ఈ అవతారం ఎత్తాడు. దీంతో సోషల్ మీడియాలో సూర్య కుమార్ యాదవ్ గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది.
Update – Suryakumar Yadav copying Usman tariq style during practice session.
– When you know, you are living rent free in their head, and they are afraid, so they start doing every dumb thing they possibly can. pic.twitter.com/60nXqUEWf6
— Salman. (@TsMeSalman) February 14, 2026