Husband and Wife: భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఉన్నారనే సందేహం ఉందా? ఇలా తెలుసుకోండి

భార్యాభర్తల మధ్య ఇంకో వ్యక్తి ఉన్నారనే సందేహంతో భాగస్వామిని అనుమానిస్తారు. దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగా వస్తాయి. ఇద్దరూ విడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ల ప్రవర్తనను బట్టి తెలుసుకోండి. అప్పుడే ఎలాంటి గొడవలు లేకుండా మీ సందేహం కూడా క్లియర్ అయిపోతుంది.

Written By: Kusuma Aggunna, Updated On : September 18, 2024 2:34 pm

Interference of Third Person In Husband-Wife

Follow us on

Husband and Wife: ఈరోజుల్లో బంధాలు ఎలా ఉన్నాయంటే ఒక్కసారి వదిలేస్తే.. ఇంకో వ్యక్తికి దగ్గర అవుతున్నారు. చాలా మంది అయితే ఒకరితో రిలేషన్‌లో ఉన్నా కూడా వేరే వాళ్లతో మళ్లీ సంబంధం పెట్టుకుంటున్నారు. పెళ్లి అయి పిల్లలు ఉన్నా కూడా వేరే వాళ్ల మీద ఇష్టం పెంచుకుంటున్నారు. ఈ విషయాలని కూడా భాగస్వామికి చెప్పరు. తెలియకుండా మెయింటెన్ చేస్తారు. ఇలా వేరే వాళ్ల మీద వ్యామోహంతో వాళ్ల భాగస్వామిని దూరం పెడతారు. అసలు ప్రేమగా కూడా ఉండరు. అన్ని విషయాలను వాళ్ల దగ్గర రహస్యంగానే ఉంచుతారు. అయితే భార్యాభర్తల మధ్య ఇంకో వ్యక్తి ఉన్నారనే సందేహంతో భాగస్వామిని అనుమానిస్తారు. దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగా వస్తాయి. ఇద్దరూ విడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ల ప్రవర్తనను బట్టి తెలుసుకోండి. అప్పుడే ఎలాంటి గొడవలు లేకుండా మీ సందేహం కూడా క్లియర్ అయిపోతుంది. మరి దానిని తెలుసుకోవడం ఎలాగో చూద్దాం.

రహస్యాలు ఉండకూడదు
భార్యాభర్తలు అన్న తర్వాత ఎలాంటి రహస్యాలు కూడా ఉండకూడదు. అన్ని విషయాలను పంచుకోవాలి. అప్పుడే బంధం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. కానీ మీ భాగస్వామి అన్ని విషయాలను రహస్యంగా ఉంచుతున్నట్లయితే మీరు సందేహ పడాల్సిందే. మీకు తెలియకుండా వేరే వాళ్లతో మాట్లాడటం, అన్నింటికి పాస్‌‌వర్డ్‌లు పెట్టడం, మీతో సమయం గడపడానికి ఇష్టం లేకపోవడం, ఏం చెప్పిన కూడా చిరాకుగా ఉండటం, ఏ విషయం కూడా చెప్పకపోవడం వంటివి చేస్తున్నట్లయితే మీరు సందేహ పడాల్సిందే.

వాళ్ల గురించే ఎప్పుడు చెబుుతుంటే?
భార్యాభర్తలు అన్ని విషయాల గురించి చర్చించుకోవాలి. కుటుంబ ఖర్చులు, పిల్లల భవిష్యత్తు, సేవింగ్స్ ఎలా అని చర్చించుకోవాలి. అలాగే రోజులో జరిగిన విషయాలు, ఆఫీస్‌లో జరిగిన అన్నింటిని భాగస్వామితో చెప్పుకోవాలి. ఏదో బిజీలో మీతో చెప్పకపోతే పర్లేదు. కానీ సందర్భం వచ్చిన కూడా ఇలాంటి విషయాలు చెప్పకుండా కేవలం ఒక్కరి గురించి మాత్రమే చెబుతుంటే.. మీరు అనుమానించడంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్లకి ఇష్టమైన వ్యక్తి గురించి పదే పదే మాట్లాడటానికి ఇష్టపడతారు. అలా చేస్తున్నట్లయితే మీ మధ్యలో ఇంకో వ్యక్తి ఉన్నారని అనుకోవచ్చు.

మీకు దూరంగా ఉంటున్నారా?
భాగస్వామి అంటే ఇష్టం లేని వాళ్లు దూరంగా పెడతారు. లేదా వాళ్లకి వేరే వాళ్లు అయిన ఇష్టం ఉండాలి. ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నవాళ్లు ఇప్పుడు అకస్మాత్తుగా దూరంగా పెడితే డౌట్ పడండి. కనీసం మీతో సమయం గడపడానికి కూడా ఇష్టం లేక.. ఏదో కారణాలు చెప్పి తప్పించుకున్నట్లయితే మీరు అనుమానించవచ్చు. మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత వేరే వాళ్లకు ఇస్తున్నారని మీకు అనిపించిన కూడా మీకు సందేహపడండి. అయితే ఇలా భార్యాభర్తల మధ్య వేరే వ్యక్తి ఉన్నారని తెలిస్తే వెంటనే గొడవ పెట్టుకోకుండా.. ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే బెటర్. ఎందుకు ఇలా దూరం పెడుతున్నారని నెమ్మదిగా చర్చించుకునే ప్రయత్నం చేయాలి. భాగస్వామికి మీ బాధను అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా బంధం ఇంకా మెరుగుపడుతుంది. ఇలా వేరే వాళ్లు ఉన్నారనే సందేహంతో గొడవలు పడి విడిపోవద్దు.