https://oktelugu.com/

Dowry: మన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టే అమ్మాయి విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు?

Dowry: సాధారణంగా ప్రతి ఒక్కరు తమ అబ్బాయికి మంచి సంబంధం రావాలని కోరుకుంటారు. తన ఇంట్లో అడుగుపెట్టే కోడలు ఎంతో అందంగా, చూడముచ్చటగా ఉండాలని ప్రతి ఒక్క తల్లి తన కొడుకు గురించి ఆలోచిస్తారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు వారి కోరికల వల్ల పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే తమ ఇంటికి రాబోయే కోడలు కేవలం అందంలో మాత్రమే కాదు ఐశ్వర్యంలో కూడా ఎంతో గొప్పగా ఉండాలని భావిస్తూ ఎన్ని సంబంధాలు వచ్చినా తిరస్కరిస్తూ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 18, 2022 / 10:30 AM IST

    Dowry

    Follow us on

    Dowry: సాధారణంగా ప్రతి ఒక్కరు తమ అబ్బాయికి మంచి సంబంధం రావాలని కోరుకుంటారు. తన ఇంట్లో అడుగుపెట్టే కోడలు ఎంతో అందంగా, చూడముచ్చటగా ఉండాలని ప్రతి ఒక్క తల్లి తన కొడుకు గురించి ఆలోచిస్తారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు వారి కోరికల వల్ల పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే తమ ఇంటికి రాబోయే కోడలు కేవలం అందంలో మాత్రమే కాదు ఐశ్వర్యంలో కూడా ఎంతో గొప్పగా ఉండాలని భావిస్తూ ఎన్ని సంబంధాలు వచ్చినా తిరస్కరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అబ్బాయిల పెళ్లి మరింత ఆలస్యం అవుతుంది.అయితే మన ఇంట్లో కోడలిగా అడుగు పెట్టే వారి విషయంలో కొన్ని పొరపాట్లు చేయకపోవడం వల్ల తొందరగా పెళ్లి జరుగుతుందని చెప్పవచ్చు. మరి ఆ పొరపాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

    సాధారణంగా మన ఇంట్లో మన అమ్మాయి లేదా అబ్బాయికి ఎంతో ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగినప్పుడు తదుపరి వారికి కూడా అలాంటి సంబంధం రావాలి అనుకోవడం పొరపాటు.చాలామంది మన అబ్బాయి మంచిగా సంపాదిస్తున్నాడు కనుక అధిక మొత్తంలో కట్నకానుకలు కావాలని డిమాండ్ చేస్తారు. ఇలా చేయటం వల్ల ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. మన ఇంటికి కోడలిగా తెచ్చుకునే అమ్మాయి డబ్బు పరంగా మంచి స్థాయిలో ఉన్నది కాకుండా,ఎంతో మంచి గుణగణాలు ఉన్న అమ్మాయిని మాత్రమే ఎంచుకోవాలి. అలాంటి అమ్మాయే ఇంటి కోడలిగా రావాలని భావించాలి.

    అందం అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనిపిస్తుంది. నా కంటికి మంచిగా అనిపించినది ఇతరులకు అందంగా కనిపించకపోవచ్చు.అందుకే అందానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అమ్మాయిలు మంచి గుణగణాలు ఉండేలా అలాంటి అమ్మాయి కోడలిగా రావాలని భావించాలి కాని, కట్నకానుకలు ఎక్కువగా కావాలని మొండి పట్టు పట్టి ఎక్కువ ఆశిస్తే మన అబ్బాయి జీవితమే నాశనం అవుతుంది కనుక కోడలిగా తెచ్చుకునే అమ్మాయి విషయంలో పలు జాగ్రత్తలు వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది.

    Tags