Garden: మనం ఇంట్లో వాస్తు ప్రకారం అన్ని ఉండేలా చూసుకుంటాం. ప్రతి దాని విషయంలో పక్కా వాస్తు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకునే దిశలు కూడా వాస్తు ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే మనకు కష్టాలు రావడం సహజం. ఇంటికి ఎటు వైపు మొక్కలు పెంచుకుంటే మంచి లాభాలు వస్తాయో తెలుసుకుని పెంచుకోవడానికి చొరవ చూపాలి. అప్పుడే మనకు వాస్తు ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
మన ఇంటి ఆవరణలో చెట్లు పెంచాలనుకుంటే తూర్పు లేదా ఉత్తర భాగాల్లో మాత్రమే పెంచుకోవాలి. ఈశాన్యం ప్రాంతంలో ఖాళీగా వదిలేయాలి. లేకపోతే వాస్తు ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ క్రమంలో మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి. పొడవైన చెట్టను దక్షిణ, పడమర, నైరుతి భాగాల్లోనే పెంచుకోవాలి. మధ్యాహ్నం సమయంలో వాటి నీడ మన ఇంటిపై పడకుండా చూసుకోవాలి.
పెద్ద చెట్లను ఇంటికి దగ్గరగా నాటకూడదు. ఎందుకంటే అవి ఇంటి పునాదిని దెబ్బతీస్తాయి. దీని వల్ల వాటిని ఇంటికి దూరంగా పెంచాలి. కీటకాలు, పురుగులు, తేనెటీగలు, పాములను ఆకర్షించే చెట్టను ఉంచకుకుంటే మనకు నష్టమే కలుగుతుంది. ఎక్కువగా పూల చెట్లను పెంచుకుంటే మంచి ఫలితాలు రావడం సహజమే. దీంతో చెట్ల పెంపకంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంటి ప్రహరీ ముందు భారీ చెట్లను పెంచకూడదు. దీంతో గోడ దెబ్బతింటుంది. వేప, మామిడి, అరటి వంటి చెట్లు పెంచుకుంటే మంచిదే. సువాసనను పెంచే చెట్లు పెంచుకోవాలి. ఉత్తరం, తూర్పు దిశల్లో తోట పెంచుకుంటే మంచి జరుగుతుంది. తోటను ఎప్పుడు కూడా పడమర, దక్షిణ దిశల్లో పెంచకూడదు. వాస్తు ప్రకారం ఇబ్బందులు వస్తాయి.