https://oktelugu.com/

Astrology: మీరు పుట్టిన తేదీ బట్టి మీకు ఏ రత్నం కలిసి వస్తుందో తెలుసా?

Astrology: సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితం ఎంతో మంచిగా ఉండాలని భావించి వారి జాతకాన్ని బట్టి వారికి ఏ రత్నం అయితే సరిగ్గా సూట్ అవుతుందో అలాంటి రత్నం ధరిస్తుంటారు. అయితే కొందరికి మాత్రం ఇలా రత్నాల విషయంలో కొంత అయోమయ పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ తేదీలో పుట్టిన వారు ఎలాంటి రత్నం ధరించాలి అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం… మన విశ్వంలో తొమ్మిది గ్రహాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2021 11:58 am
    Follow us on

    Astrology: సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితం ఎంతో మంచిగా ఉండాలని భావించి వారి జాతకాన్ని బట్టి వారికి ఏ రత్నం అయితే సరిగ్గా సూట్ అవుతుందో అలాంటి రత్నం ధరిస్తుంటారు. అయితే కొందరికి మాత్రం ఇలా రత్నాల విషయంలో కొంత అయోమయ పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ తేదీలో పుట్టిన వారు ఎలాంటి రత్నం ధరించాలి అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం… మన విశ్వంలో తొమ్మిది గ్రహాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే అదేవిధంగా 9 సంఖ్యలు ఉండగా ఒక్కో సంఖ్యను ఒక్కో గ్రహం పాలిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే ఏ సంఖ్య వారు ఏ విధమైనటువంటి వజ్రాన్ని ధరించాలి అనేది తెలుసుకుందాం

    Astrology

    Astrology

    *ఒకటవ సంఖ్యను ఎల్లప్పుడు సూర్యుడు పాలించ బడతారు ఒకటవ సంఖ్య కలిగిన వారికి రూబీ ఎంతో అనుకూలమైన రత్నం అని చెప్పాలి. రూబీ సూర్యుడు గ్రహానికి చెందినది కనుక ఎవరైతే1,10,19, 28 తేదీలలో జన్మించి ఉంటారో అలాంటివారు రూబీ ఉంగరాన్ని కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించడం ఎంతో ఉత్తమం.

    *రెండవ సంఖ్యకు ఎల్లప్పుడు చంద్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ క్రమంలోనే 2, 1, 20, 29 తేదీలలో జన్మించిన వారు తప్పకుండా ముత్యపు ఉంగరాన్ని ధరించడం ఎంతో ఉత్తమం.ఈ ఉంగరం మీకు అదృష్టం ఇవ్వడమే కాకుండా మీలో ఉన్న కోపాన్ని తగ్గించి మీకు మంచి ఆరోగ్యం ఇస్తుంది.

    *మూడవ సంఖ్యకు బృహస్పతి అధిపతి కనుక ఇలాంటి వ్యక్తులకు పసుపు,నీలమణి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఉంగరాన్ని తయారు చేయించుకుని చూపుడు వేలుకు ధరించడం ఎంతో మంచిది. ముఖ్యంగా 3, 12, 21,30 తేదీలలో జన్మించిన వారు ఈ విధమైనటువంటి ఉంగరాన్ని ధరించడం ఎంతో శుభకరం.

    *నాల్గవ సంఖ్యకు అధిపతి రాహువు కనుక 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారు, గోమెడ్ లేదా హెస్సోనైట్ చాలా సరిఅయిన రత్నం. బుధవారం నాడు మధ్యవేలు లేదా చిటికెన వేలికి ధరించాలి. ఇలా ఈ ఉంగరం ధరించడం వల్ల అదృష్టంతో పాటు ఆరోగ్యం బాగా కలిసి వస్తుంది.

    * ఐదవ సంఖ్యకు అధిపతి మెర్క్యూరీ కనుక 5,14,23 వ తేదీ జన్మించిన వారు పచ్చని ధరించడం వల్ల మీకు ఎంతో మేలు చేకూరుతుంది. ఈ తేదీల్లో జన్మించిన వారు బుధవారంనాడు ఈ ఉంగరాన్ని చిటికెన వేలికి ధరించాలి.

    *ఆరవ సంఖ్య వారికి అధిపతి శుక్రుడు కనుక వీరు డైమండ్ ధరించడం ఎంతో మంచిది. ముఖ్యంగా 6,15,24 వ తేదీలలో జన్మించిన వారు శుక్రవారం నాడు మధ్యవేలుకి డైమండ్ రింగ్ ధరించడం ఎంతో మంచిది.

    Also Read: తరచూ స్టవ్‌పై పాలు పొంగి పోతున్నాయా.. ఈ సింపుల్ చిట్కా పాటించాల్సిందే!

    *ఏడవ సంఖ్య వారిని నెప్ట్యూన్ గ్రహం పాలించ బడుతుంది కనుక వీరు వెండి లేదా అష్టధాతువు ఉంగరాన్ని గురువారం రోజు చిటికెన వేలుకు ధరించాలి. ముఖ్యంగా 7,16, 25 వ తేదీలలో జన్మించిన వారు ఈ ఉంగరాన్ని ధరించాలి.

    *8వ సంఖ్య వారికి అధిపతి గ్రహం శని గ్రహం. ఇలాంటి వారు నీలం రంగు రాయి లేదా నీలమని ధరించడం ఎంతో మంచిది ఈ నీలమణి ధరించడం వల్ల పక్షవాతం, మతిస్థిమితం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. 8,17 ,26 వ తేదీలలో జన్మించిన వారు నీలమణి శనివారం మధ్యవేలుకు వెండి లేదా అష్టదాతువుతో ధరించాలి.

    *9వ సంఖ్య వారికి అధిపతి అంగారక గ్రహం కనుక వీరు ఎరుపు కోరల్ ఎంతో మంచిది.9, 18, 27 వ తేదీలలో జన్మించిన వారు మంగళవారం రోజు ఉంగరపు వేలికి ధరించాలి.

    Also Read: వాస్తుశాస్త్రం ప్రకారం డబ్బును పొరపాటున కూడా ఈ దిశలో భద్రపరచుకూడదు?