Vastu Tips: సాధారణంగా మనం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతో బాగా నమ్ముతాము. ఈ క్రమంలోనే మనం ఇంట్లో సమకూర్చుకునే ప్రతి ఒక్క వస్తువు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో ఉండే విధంగా అలంకరించుకుంటాము.అయితే చాలామంది ప్రతిరోజు ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉన్నప్పటికీ వారి చేతిలో ఒక్క రూపాయి కూడా నిలబడదు. ఇలా డబ్బు మొత్తం వృధా ఖర్చులకు పోతుంది.మరి సంపాదించిన డబ్బు మన చేతిలో నిలబడి ఆర్థిక ఎదుగుదల ఉండాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో డబ్బును భద్రపరిచే స్థలం కూడా సరైనదే ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read: తరచూ స్టవ్‌పై పాలు పొంగి పోతున్నాయా.. ఈ సింపుల్ చిట్కా పాటించాల్సిందే!
వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బులు మన ఇంట్లో ఎల్లప్పుడు ఉత్తరం వైపు మాత్రమే భద్రపరచాలి. ఇలా ఉత్తర దిశలో డబ్బులు భద్రపరిచినప్పుడు మాత్రమే మన ఇంట్లో ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. అలా కాకుండా డబ్బులు పొరపాటున కూడా పడమర దిశలో పెట్టడం వల్ల మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందుకోసమే ఇంట్లో పొరపాటున కూడా డబ్బులు పడమర దిశ వైపు పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
డబ్బులు ఎల్లప్పుడూ ఉత్తర దిశలో లేదా తూర్పు ఉత్తరం మూలలో కూడా భద్రపరచాలి. ఇలా ఈ దిశలో భద్రపరచడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా మన చేతిలో డబ్బు నిలబడుతుంది. ఇక ఉత్తరం దిశలో డబ్బులు ఎందుకు భద్రపరచాలి అనే విషయానికి వస్తే… ధనానికి అధిపతి కుబేరుడు ఆయన అనుగ్రహం కలిగితే మనకు లక్ష్మీకటాక్షం కలుగుతుంది. అయితే కుబేరుడికి ఉత్తరం ఎంతో ఇష్టమైన దిశ కనుక ఉత్తరదిశలో డబ్బును భద్రపరచడం వల్ల కుబేరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది.
Also Read: మీరు పుట్టిన తేదీ బట్టి మీకు ఏ రత్నం కలిసి వస్తుందో తెలుసా?