https://oktelugu.com/

Viral News: హనీమూన్ ప్లాన్ చేసిన నూతన జంట.. అయితే భర్త ఇచ్చిన ట్విస్ట్ చూసి షాక్ అయిన భార్య?

Viral News: సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత చాలామంది హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు నూతన దంపతులు ఒంటరిగా గడపటం వల్ల ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని ఒకరినొకరు ఎంతో అర్థం చేసుకోవడం కోసం ఈ విధమైనటువంటి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఒక జంట పెళ్లి కాకుండానే వారి హనీమూన్ ఎక్కడికి వెళ్లాలి అని ప్లాన్ చేసుకున్నారు. ఇలా ఇద్దరూ కలిసి ఒక అందమైన ప్రదేశాన్ని […]

Written By: , Updated On : December 19, 2021 / 08:08 AM IST
Follow us on

Viral News: సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత చాలామంది హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు నూతన దంపతులు ఒంటరిగా గడపటం వల్ల ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని ఒకరినొకరు ఎంతో అర్థం చేసుకోవడం కోసం ఈ విధమైనటువంటి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఒక జంట పెళ్లి కాకుండానే వారి హనీమూన్ ఎక్కడికి వెళ్లాలి అని ప్లాన్ చేసుకున్నారు. ఇలా ఇద్దరూ కలిసి ఒక అందమైన ప్రదేశాన్ని ఎంచుకొని పెళ్లి తర్వాత హనీమూన్ అక్కడికి వెళ్లాలని భావించారు.

Viral News

Viral News

Also Read: మీరు పుట్టిన తేదీ బట్టి మీకు ఏ రత్నం కలిసి వస్తుందో తెలుసా?

అయితే ఈ జంట హనీమూన్ వెళ్లే ప్రదేశం ఏంటి అనే విషయాలను వరుడు తన స్నేహితులకు చెప్పాడు. దీంతో వారు కూడా ఎంతో సంతోషపడి మేం కూడా ఎప్పటి నుంచి ఈ ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటున్నాము అయితే కుదరలేదు ఈ సందర్భంగా మీతో పాటు మేము కూడా వస్తామని తన స్నేహితులు చెప్పడంతో వరుడు కాదనలేకపోయారు. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని తనకు కాబోయే భార్యకు చెప్పి ఆమెకు షాక్ ఇచ్చాడు.

దీంతో తన అభిప్రాయం విన్న వధువు ఏకంగా వరుడిని ఇడియట్ అంటూ తిట్టడమే కాకుండా తన పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరితో పాటు హనీమూన్ కు తన స్నేహితులు రావడం తనకు ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్పేసింది. అప్పటికీ ఆ వరుడు వధువును ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆమె ససేమిరా అంటూ ఒప్పుకోలేదు. ఇక వధువు ఒప్పుకోకపోవడంతో వరుడు తన ఈ నిర్ణయాన్ని రెడ్డిట్ ద్వారా సదరు వ్యక్తి నెటిజన్లకు పంచుకోగా.. వారంతా అతడ్ని ట్రోల్ చేయడమే కాకుండా హనీమూన్ కు స్నేహితులతో కలిసి వెళ్లడం ఏంటి అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: మీ కళ్ళకు అద్భుతమైన పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత దాగి ఉంది ఎక్కడో గుర్తించండి?