WHO logo: ప్రపంచ ప్రజల కోసం కొన్ని వైద్య సలహాలు, సూచనలు ఇచ్చేందుకు World Health Organisation (WHO) కీలకంగా పనిచేస్తుంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అని తెలిపేందుకు ఒక చిహ్నం ఎప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. దీనిని రాడ్ ఆఫ్ ఆస్కలెపియస్ అని అంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ చిహ్నంలో ఒక పాము కర్రకు చుట్టుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ కర్ర గ్రీకు వైద్య దేవుడు ఆస్కలెపియస్ అని అంటున్నారు. పాము నడిచే విధానం ఆరోగ్యానికి పునర్జన్మ అని భావించారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇలాంటి సింబల్ ను పెట్టారు. అయితే ఈ సింబల్ గురించి పూర్తి వివరాలు లోకి వెళితే..
ప్రపంచంలో ఉన్న దేశాలు ఒకే తాటిపై ఉంటూ.. ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేయాలన్న ఉద్దేశంతో World Health Organisation (WHO) ను 1948 ఏప్రిల్ 7న స్థాపించారు. స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం.. ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరికలను జారీ చేయడం.. వ్యాధుల నివారణకు సరైన సలహాలు ఇవ్వడం.. వైద్య సేవలపై ప్రమాణాలు మెరుగుపరచడం వంటివి ఈ సంస్థ చేరుతుంది. అయితే ఈ సంస్థకు ప్రతిరూపంగా ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఈ చిహ్నం కొన్ని విషయాలను తెలుపుతుంది.
చిహ్నంలో ఉన్న ప్రపంచ పటం డబ్ల్యూహెచ్ఓ కార్యకలాపాల విశాలతను తెలియజేస్తుంది. దేశం, మతం, జాతి భేదం లేకుండా ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ ప్రపంచ పటం ఉద్దేశం. ప్రపంచమంతా ఒకేచక్రంలా తిరుగుతున్నట్లు ఇది సూచిస్తుంది. ఈ లోగో చుట్టూ ఓలివ్ ఆకులు ఉంటాయి. ఈ ఆకులు శాంతి, ఐక్యతకు సమానం. ఆరోగ్యాన్ని కాపాడడంలో శాంతి అవసరమని ఈ సంస్థ సూచిస్తుంది.
ప్రపంచంలో ఉన్న వ్యాధుల తీవ్రతను, కొత్త టీకాలను కనుగొనడం, వైద్య పరికరాల ఆమోదం ముద్ర వేయడం వంటివి ఈ సంస్థ చేస్తుంది. అలాగే ప్రకృతి విపత్తులు, వ్యాధుల ఉధృతి జరిగినప్పుడు ఈ సంస్థ వెంటనే సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. ఆఫ్రికా దేశంలో ఎబోలా వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు ఈ సంస్థ సరైన వైద్య సహాయాన్ని అందించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలియో నిర్మూలన కార్యక్రమం, డెంగ్యూ వంటి వాటి నివారణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
కేవలం వైద్య సలహాలు, సూచనలు మాత్రమే కాకుండా పోషకాహారం, ఆహార భద్రతపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పిల్లల్లో పోషకాహార లోపం నివారణ, ఆహారంలో రసాయన, పురుగుల మందుల నియంత్రణ, ఆహార పదార్థాల లేబులింగ్ ప్రమాణాలు వంటివి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తుంది.