Emraan Hashmi satire Pawan Kalyan: ‘ఓజీ'(They Call Him OG) చిత్రం తో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెట్టడం అభిమానుల్లో వేరే లెవెల్ ఉత్సాహాన్ని నింపింది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ అయిపోయాడు, సినిమాలు చేయడమే ఎక్కువ, ఇక ఆయన నుండి సూపర్ హిట్స్ కోరుకోవడం అత్యాశే అని అభిమానులు కూడా బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయిన టైం లో వచ్చిన సినిమా ఇది. ఓజీ చిత్రం లోని పవన్ కళ్యాణ్ నటన, స్టైల్, స్వాగ్ మరియు ఫైట్స్ నేటి తరం ఆడియన్స్ ని వెర్రిక్కిపోయేలా చేసింది. పవర్ స్టార్ విశ్వరూపం ఇదా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా వేరే లెవెల్ లో ఉంది. ఇక ఈ చిత్రం లో విలన్ గా నటించిన బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ(Emran Hashmi) కి కూడా మంచి మార్కులే పడ్డాయి.
చాలా కాలం తర్వాత ఇమ్రాన్ హష్మీ కి ఒక పవర్ ఫుల్ స్టైలిష్ రోల్ పడిందని ఆయన అభిమానులు కూడా సంతోషించారు. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ కోసం చేయించిన ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ ‘ఒమీ ట్రాన్స్’ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కడ చూసినా ఈ ఆడియో తో రీల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సినిమాలో ఆయన క్యారక్టర్ కూడా హీరో తో సమానంగా ఉంటుంది, డైరెక్టర్ సుజిత్ చాలా పవర్ ఫుల్ గా చూపించాడు. అయితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇది పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడినవి అని చాలా మంది అనుకుంటున్నారు.
విలేఖరి ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈమధ్య కాలం లో హీరోలు షూటింగ్ సెట్స్ కి సమయానికి రావడం లేదు కదా?’ అని అడిగిన ప్రశ్నకు, ఇమ్రాన్ హష్మీ సమాధానం చెప్తూ ‘టైం కి సెట్స్ కి రావడం సంగతి పక్కన పెట్టండి. అసలు సెట్స్ కి కూడా రావడం లేదు’ అని చెప్పుకొచ్చాడు. ఆయన ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పినట్టు?, రీసెంట్ గా ఆయన నటించిన చిత్రం ‘ఓజీ’ కాబట్టి, కచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడింది అని అనుకుంటున్నారు. మరి కొంతమంది అయితే టైగర్ 3 లో కూడా ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు కాబట్టి, ఇది సల్మాన్ ఖాన్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని మరికొంత మంది అంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఓజీ సినిమా షూటింగ్ ఇమ్రాన్ హష్మీ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక్క సన్నివేశం కూడా తియ్యలేదట. దూప్స్ తో కానిచ్చేసారట, అందుకు కారణం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చిన సమయం లో ఇమ్రాన్ హష్మీ కి డెంగ్యూ ఫీవర్ ఉండడం వల్లే, కాబట్టి ఆయన కచ్చితంగా పవన్ ఉద్దేశించే మాట్లాడి ఉంటాడని అంటున్నారు.
Emraan please hesitate
CC: @THRIndia_ pic.twitter.com/lmDKFrTJ0m
— ANMOL JAMWAL (@jammypants4) October 27, 2025