Drinking tea on empty stomach: ఉదయం లేవగానే మనస్సు స్తబ్దంగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసం కోసం వెంటనే బెడ్ కాఫీ తాగేవారు చాలామంది ఉంటారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. అయితే పరగడుపున టి లేదా కాఫీ తాగడం వల్ల మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది. ఆ రోజంతా యాక్టివ్ గా ఉంటారు. కానీ ఈ పానీయాలు సేవించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పరగడుపున వీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే టీ, కాఫీ తాగే వాటికంటే ముందు ఇలా చేయాలి?
ఉదయం లేవగానే కొంతమంది వ్యాయామం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఉద్యోగం, వ్యాపారం కారణంగా తీరిక లేకపోవడంతో వెంటనే తమ విధుల్లోకి వెళుతుంటారు. ఈ క్రమంలో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ముందుగా టీ లేదా కాఫీ తీసుకుంటారు. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. అయితే ఇలా పరగడుపున టీ తాగడం వల్ల కడుపులో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రి తిన్న ఆహారం పిండి పదార్థంలా తయారై కడుపులో ఉండిపోతుంది. ఈ సమయంలో పిండి పదార్థం పై కెఫెన్ అనే పదార్థం కలిగిన టి తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉండదు. ఫలితంగా కడుపు ఉబ్బరంగా ఉండి గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో రోజంతా ఎలాంటి ఆహారం తీసుకోవాలని అనిపించదు. ఆ తర్వాత అలసటగా ఉండి అనారోగ్యాన బారిన పడే అవకాశం ఉంటుంది. అందువల్ల పరగడుపున ఎట్టి పరిస్థితుల్లో టీ లేదా కాఫీ తీసుకునే ప్రయత్నం చేయొద్దు.
మరి టీ కాఫీల కంటే ముందు ఏం తీసుకోవాలి? ఉదయం లేవగానే వ్యాయామం చేసేవారైతే ఎనర్జీ కోసం జ్యూస్ తీసుకోవడం మంచిది. ఇవి అందుబాటులో లేని పక్షంలో వేడి నీరు తయారు చేసుకొని అందులో తేనె కలుపుకొని తాగడం వల్ల కడుపులో ఉన్న ఆహారం జీర్ణం అవుతుంది. అంతేకాకుండా ఏవైనా మలినాలు ఉంటే మూత్ర రూపంలో బయటకు వెళ్తుంది. రాత్రి భోజనం చేసిన ఆహారం కడుపులో అలాగే ఉండిపోవడంతో దానిని జీర్ణం చేయడానికి ఉదయం నీరు మాత్రమే తీసుకోవాలి. లేదా ద్రవరూపంలో జ్యూస్ తీసుకున్న పర్వాలేదు. అయితే ఈ జ్యూస్ త్వరగా జీర్ణం అయ్యే దిగా ఉండాలి. ఇందులోనూ పైనాపిల్ జ్యూస్ అయితే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉదయం దాదాపు నీరు తాగే ప్రయత్నం చేయాలి. ఈ నీరు కూడా వేడి నీరు అయితే ఇంకా బాగుంటుంది.
ఇలా వేడి నీరు తాగిన తర్వాత టీ తీసుకోవచ్చును. అయితే ఇది కూడా రోజుకు రెండుసార్లు మాత్రమే తీసుకోవాలి. టీ తాగడం వల్ల మానసికంగా ఉత్తేజంగా ఉంటారు. కానీ ఇదే సమయంలో నిద్ర భంగం కలిగించే అలవాటు టీ కి ఉంటుంది. అందువల్ల ఎక్కువసార్లు టీ లేదా కాఫీ తాగడం వల్ల సరైన నిద్రపోయే అవకాశం ఉండదు. నిద్రలేమి సమస్య ఎదుర్కొనేవారు టీ కాఫీలకు దూరంగా ఉండటమే మంచిది. అందుకు ప్రత్యామ్నాయంగా జ్యూస్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేదా వేడి నీటిలో తేనె కలుపుకొని తాగడం వల్ల కూడా ఆరోగ్యకరమే.