Moles On Body: ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉంటే.. వద్దన్నా డబ్బు.. మరి నుదుటిపై ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

కొందరి మోహం చూడగానే పుట్టుమచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఉండడం వల్ల వారు అందంగా కనిపిస్తారు. మరికొందరు మాత్రం వికారంగా కనిపిస్తారు. ముఖ్యంగా పెదాలపై పుట్టుమచ్చ ఉండడం వల్ల ఆకర్షణీయంగా ఉంటారు.

Written By: Chai Muchhata, Updated On : August 1, 2024 10:39 am

Moles On Body

Follow us on

Moles On Body: ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు. కానీ ఎంత మంది ఉంటారనేది స్పష్టత లేదు. అయితే ఒకే రూపం కలిగిన చాలా మంది తారసపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఎక్కువగా ఉంటే ఏర్పడే ఇబ్బందులను అధిగమించడానికి కొన్ని గుర్తుల ఆధారంగా వారి గురించి తెలుసుకుంటారు. వీటిలో పుట్టు మచ్చలు ఒకటి. మనుషులు పోలిన మనుషులు ఎంతో మంది ఉన్నా.. ఒక మనిషికి ఉన్న పుట్టుమచ్చలు..మరో మనిషికి సమానంగా ఉండవు. అందుకే పాఠశాల స్థాయి నుంచి ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకోవడానికి పుట్టు మచ్చలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొంత మందికి ఎక్కువ పుట్టు మచ్చలు ఉండొచ్చు.. మరికొందరికి తక్కువ ఉండొచ్చు. పుట్టు మచ్చలు ఎక్కువగా ఉండడం వల్ల అనేక అనారోగ్యాలు ఉంటాయని కొందరు వైద్యుల చెబుతున్నారు. అలాగే పుట్టుమచ్చల్లో కొన్ని రకాలు ఉంటాయి. వీటిలో నల్లవి కాకుండా ఎరుపు రంగులో కూడా ఉంటాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం చూస్తే కొన్ని పుట్టుమచ్చలు వారి భవిష్యత్ జీవితాన్ని నిర్దేశిస్తాయి. చాలా మందికి శరీరంలో వివిధ భాగాల్లో పుట్టుమచ్చలు ఉంటాయి. వీటిలో కొన్ని భాగాల్లో ఉండడం వల్ల మంచి జరుగుతుంది. మరికొన్ని ప్రదేశాల్లో ఉండడం వల్ల కీడు కలుగుతుంది. అలాగే కొందరికి మోహం పై పుట్టుమచ్చలు ఉంటాయి. మరికొందరికి కనిపించని ప్రదేశాల్లో వస్తాయి. అయితే ఏయే భాగాల్లో పుట్టుమచ్చలు ఉండడం వల్ల ఎలాంటి సంకేతాలు ఉంటాయి? వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు? అనే వివరాల్లోకి వెళ్దాం..

కొందరి మోహం చూడగానే పుట్టుమచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఉండడం వల్ల వారు అందంగా కనిపిస్తారు. మరికొందరు మాత్రం వికారంగా కనిపిస్తారు. ముఖ్యంగా పెదాలపై పుట్టుమచ్చ ఉండడం వల్ల ఆకర్షణీయంగా ఉంటారు. అయితే నుదుటిపై ఎడమ వైపు పుట్టుమచ్చ ఉండడం వల్ల అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం తెలుపుతుంది. ఇలాంటి వారు ఎక్కువగా తమ గురించే ఆలోచిస్తారు. కొన్ని విషయాల్లో స్వార్థ పరులుగా ప్రవర్తిస్తారు. దీంతో వీరు ఎక్కువగా కుటుంబ సభ్యులకు దూరమవుతారు. ఉద్యోగం, వ్యాపారం ఏ పని చేపట్టినా అందులో కష్టాలను ఎదుర్కొంటారు.

కొందరు ఆడవాళ్లకు పెదాలపై పుట్టుమచ్చ కనిపిస్తుంది. ఇది చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఇలా పుట్టుమచ్చ ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని సాముద్రిక శాస్త్రం తెలుపుతుంది. వీరు ప్రతీ విషయంలో చాలా ఆలోచిస్తారు. ఏ పనిని తొందరగా పూర్తి చేయరు. ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది.

సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి చాతిపై పుట్టుమచ్చ ఉంటే అదృష్ట వంతులు. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వీరు మంచి తల్లిదండ్రులుగా ఉంటారు. ఏ పని చేసినా ధైర్యంగా ముందుకు సాగుతారు. ఇక మెడ కింద పుట్టు మచ్చలు ఉండడం వల్ల అశుభాలు ఎదుర్కొంటారు. ప్రతీ పని విషయంలో బద్దకంగా ఉంటారు. చిన్న విజయానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. దీంతో వీరు చాలా మందికి దూరమవుతారు.

పుట్టుమచ్చలు ఎరుపు రంగులో ఉంటే అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. ఇలాంటి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వీరి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మిగతా వారి కంటే వీరు విజయాలు ఎక్కువగా సాధిస్తారు. ఇలాంటి వారి ఇళ్లల్లో సందద ఎక్కువగా ఉంటుంది. ఐశ్వర్యవంతులుగా మారుతారు. అయితే కొన్ని రకాల పుట్టు మచ్చలు క్యాన్సర్ కారకంగా ఉంటాయి. అందువల్ల ఎక్కువగా పుట్టుమచ్చలు ఉన్నవాళ్లు అనారోగ్యాన బారిన పడితే తప్పకుండా వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకునేందుకు ప్రయత్నించాలి.